ఆక్సిజెన్ కొరతవల్ల దేశంలో ఏ ఒక్కరూ చనిపోలేదు..పార్లమెంట్ సాక్షిగా చెప్పిన మాట ఇది..

  0
  97

  ఆక్సిజెన్ కొరతవల్ల దేశంలో ఏ ఒక్కరూ చనిపోలేదు.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆరోగ్య సహాయమంత్రి భారతి ప్రవీణ్ పవర్ చెప్పిన మాట ఇది..అంటే ఇదే నిజమని మనం నమ్మాలి.. ఎందుకంటే అది పార్లమెంట్ కాబట్టి..కోవిడ్ సెకండ్ వేవ్ లో దేశంలో వేలమంది ఆక్సిజన్ లేక పక్షుల్లా విలవిలలాడి ప్రాణాలు కోల్పోయారని మీడియాలో వచ్చాయి..ప్రపంచమే మనదేశంలో విలయాన్ని చూసి సానుభూతి చూపింది.. ఆక్సిజన్ అందించే ప్రయత్నం చేసింది.. కళ్ళముందు జరిగిన మారణహోమం ఇలా ఉంటె , దేశంలో ఏ ఒక్కరూ ఆక్సిజెన్ కొరతతో చనిపోలేదని , రాష్ట్రాలు తమకు సమాచారం ఇచ్చాయని మంత్రి చెప్పారు., అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని కూడా స్పష్టం చేశారు. మెడికల్ ఆక్సిజన్ కు మొదటి దశలో 3095 మెట్రిక్ టన్నులు డిమాండ్ ఉండగా , రెండో దశలో అది ఊహలకు అందనంతగా , 9 వేల టన్నులకు చేరుకుందని చెప్పారు. హెల్త్ సబ్జెక్ట్ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండేదని కూడా చెప్పి , చల్లగా తప్పించేసుకున్నారు..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?