డ్రైవర్ తూగితే కారులో అలారం..కొత్త ఫీచర్.

  0
  5214

  ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా ‘XUV 700’ అనే ఓ సరికొత్త మోడల్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే కంపెనీ తమ XUV 700 ఫీచర్లను ఒక్కొక్కటిగా వెల్లడి చేస్తోంది. తాజాగా లేటెస్ట్ గా రూపొందుతున్న ఈ కారుకి సంబంధించిన సేఫ్టీ ఫీచర్‌ను కంపెనీ వెల్లడి చేసింది. అదేంటంటే, డ్రైవ‌ర్ నిద్ర‌మ‌త్తులో ఉన్నా, త‌ల ఒరిగిపోతున్నా, తూగినా, అటుఇటు తిప్పినా వెంట‌నే అలెర్ట్ చేసేస్తుంది. అదెలా అంటే, డ్రైవ‌ర్ నిద్ర‌మ‌త్తులో ఉంటే ఆటోమేటిక్ గా కారు స్టీరింగ్ వైబ్రేట్ అవుతుంది. అలాగే కారులో అంద‌రికీ వినిపించేలా పెద్ద సౌండ్ ఎఫెక్ట్ ఇస్తూ అలెర్ట్ చేస్తుంది. పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్ల‌లో ఈ కారు అందుబాటులోకి కానుంది. XUV 700 విభాగంలోనే ఈ తరహా ఫీచర్‌ను కలిగి ఉన్న మొట్టమొదటి కారుగా కంపెనీ పేర్కొంది. అయితే ఈ సేఫ్టీ అలెర్ట్ ఎలా ప‌ని చేస్తుంద‌నే విష‌యాన్ని కంపెనీ పూర్తిగా వెల్ల‌డించ‌లేదు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?