మండపం కాలిపోతున్నా తినడం వదల్లేదు, చివరలో..?

  0
  46115

  రోమ్ నగరం తగలబడుతుంటే , నీరో చక్రవర్తి ఫిడెల్ వాయిస్తున్నాడని సామెత ఉంది,.. అది నిజమో కాదో ఇంతవరకు సందేహమే.. అయితే ఇప్పుడీ భోజనప్రియుణ్ణి చూస్తే మాత్రం , బహుశా నీరో చక్రవర్తి , రోమ్ తగలబడుతుంటే ఫిడేల్ వాయించింది నిజమేనని నమ్మక తప్పదు.. ఎందుకంటే ఇతడు వచ్చింది పెళ్లికి అతిధిగా.. అలాంటిది , పెళ్లి మండపంలో ఒక హాల్ తగలబడుతుంటే , మనోడు డైనింగ్ గార్డెన్లో హాయిగా మెక్కేస్తున్నాడు. తింటూ తగలబడుతున్న పెల్లు మండపాన్ని చూస్తున్నాడు.. బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.. ఈ అగ్నిప్రమాదంలో మండపంలోని కుర్చీలు , సామగ్రి , కర్టెన్లు తగలబడ్డాయి. అక్కడేఉన్న కొన్ని బైకులు , స్కూటీలు కూడా కాలిపోయాయి. ఫైరింజన్లు వచ్చి , మంటలు ఆర్పేసేదాకా మనోడు తింటూనే ఉన్నాడు,.. తరువాత తీరిగ్గా లేచిపోయాడు.. అక్కడే ఒక ట్విస్ట్.. అదేమిటంటే ఈ అగ్నిప్రమాదంలో ఈ తిండి పిచ్చోడి బైక్ కూడా తగలబడిపోయింది.. ఇదే ఖర్మ సిద్ధాంతమంటే.. వీడియో చూడండి.. ఈ ఘటన మహారాష్ట్ర లోని పూణే జిల్లా భివాండీలో జరిగింది.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.