కోవిద్ బూస్టర్ డోస్ కి శాస్త్రీయత లేదట..

    0
    295

    కోవిడ్ బూస్టర్ వాక్సిన్ అవసరానికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవట.. రెండు డోసులు కోవిడ్ వాక్సిన్ వేసుకున్నవారు , బూస్టర్ డోస్ వేసుకోవడం మంచిదన్న అబిప్రాయంపై ఐసీఎమ్ ఆర్ , డైరెక్టర్ భార్గవ్ ఒక స్పష్టత ఇచ్చారు. బూస్టర్ డోస్ పై తాము ఆలోచించడంలేదని అన్నారు. రెండు డోసులు కోవిడ్ వాక్సిన్ వేసుకున్నవారు , మూడు డోస్ ని బూస్టర్ డోస్ గా వేసుకుంటున్నారు. అయితే బూస్టర్ డోస్ విషయంలో అదెంతవరకు పనిచేస్తుందన్న విషయంలో స్పష్టత లేదని , దానికి శాస్త్రీయమైన ఆధారంకూడా లేదన్నారు. ప్రస్తుతం తాము , రెండో డోస్ కరోనా వాక్సిన్ పూర్తి చేసేపనిలో ఉన్నామని చెప్పారు. ఇప్పటివరకు దేశంలో 116 కోట్ల , 87 లక్షలు డోసులు వాక్సిన్ వేశామన్నారు. ఇంకా సెకండ్ డోస్ కి , 40 కోట్ల డోసులు వెయ్యాల్సిఉందని తెలిపారు. 12 కోట్లమంది మొదటి డోస్ మాత్రమే వేసుకొని , రెండో డోస్ వేసుకోలేదని , వారికి కూడా పూర్తిచేస్తామని తెలిపారు..

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.