ఏపీలో ఇక SSC సిలబస్ బంద్…

    0
    875

    ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో ఎస్సెస్సీ సిలబస్ ని పూర్తిగా ఆపేయాలని నిర్ణయించింది. ఎస్సెస్సీ సిలబస్ బదులు సీబీఎస్ఈ సిలబస్ చెప్పబోతున్నారు. ఈ ఏడాది.. అంటే 2021-22 విద్యా సంవత్సరానికి గాను.. 1నుంచి 7 తరగతుల విద్యార్థులకు సీబీఎస్ఈ సిలబస్ ప్రకారం బోధన ఉంటుంది.

    తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మనబడి, ‘నాడు-నేడు’ పనులు, విద్యాకానుకపై విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ఉన్నతాధికారులతో సీఎం జగన్ చేపట్టిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏడాదికి ఒక తరగతి చొప్పున 2024 నాటికి పదోతరగతి వరకు సీబీఎస్‌ఈసీ విధానం అమల్లోకి తేవాలని.. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

    విద్యాకానుకపైనా సీఎం సమీక్షించారు. విద్యాకానుకలో ఇంగ్లీష్‌-తెలుగు డిక్షనరీలను చేర్చాలని.. దాన్ని తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. పాఠ్యపుస్తకాలు కూడా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అత్యంత నాణ్యతతో ఉండాలని ఆదేశించారు. ఉపాధ్యాయులకూ డిక్షనరీలు ఇవ్వాలని చెప్పారు. అమ్మఒడి పథకం కింద విద్యార్థులకు ఇచ్చే ల్యాప్‌టాప్‌ల నాణ్యత, సర్వీసు బాగుండాలన్నారు.

    https://www.youtube.com/watch?v=cPc-gtMStcs&ab_channel=ysrcpofficial

    తొలి విడత నాడు-నేడు పనులను మార్చి నెలాఖరు నాటికి పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. ఎక్కడెక్కడ పనులు పెండింగ్‌లో ఉన్నాయనే దానిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సత్వరమే వాటిని పూర్తిచేయాలన్నారు. పాఠశాలలు మంచి డిజైన్లతో ఆహ్లాదకరంగా ఉండాలన్నారు. మౌలిక సదుపాయాల్లో రాజీ పడొద్దని.. పనులు పూర్తయిన నిర్మాణాల ఫొటోలు తీసి వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ఆదేశించారు. రెండో దశ పనులను కూడా సత్వరమే ప్రారంభించాలని.. తొలిదశలో ఎదురైన ఇబ్బందులను అధిగమించాలని అధికారులకు జగన్‌ దిశానిర్దేశం చేశారు.

    ఇవీ చదవండి:

    అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

    ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

    ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?