నాగబాబు కుమార్తె నిహారిక జిమ్ వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఆమె జిమ్ చేస్తున్న వీడియో కాదు, జిమ్ ట్రైనర్ వీపుపై ఎక్కిన వీడియో అది. జిమ్ ట్రైనర్ ని ఆటపట్టిస్తూ, అతని వీపుపై ఎక్కింది నిహారిక. నిహారికను వీపుపై ఎక్కించుకున్న ట్రైనర్ పుషప్స్ తీస్తంటాడు. అలా అతను పుషప్స్ తీస్తండగా నిహారిక వీపుపై కూర్చునే ఉంటుంది. చివరికి కిందకు దిగుతుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.
నిహారిక కూడా ఫిట్ నెస్ ఫ్రీక్ అంటారు. మామూలుగానే బక్కపలుచగా ఉండే నిహారిక.. తన ఫిజిక్ ని అలాగే మెయింటెన్ చేయడానికి జిమ్ కి వెళ్తూ ఉంటంది. ఈ క్రమంలో నిహారిక జిమ్ వీడియోలు చాలానే సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. వాటిలో ఇప్పుడు కనపడే వీడియో సంథింగ్ స్పెషల్.