భీమ్లా నాయక్ పై చంద్రబాబు ఆసక్తికర ట్వీట్..

  0
  238

  భీమ్లా నాయక్ సినిమాపై ఉదయాన్నుంచి చాలా మంది రకరకాల ట్వీట్లు వేస్తున్నారు. కానీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్వీట్ ఆసక్తికరంగా ఉంది. భీమ్లా నాయక్ సినిమాని అడ్డు పెట్టుకుని సీఎం జగన్ పై విమర్శలు ఎక్కు పెట్టారు చంద్రబాబు.

  రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సీఎం వదలడం లేదని, చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోందన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు అన్నీ పక్కన పెట్టి…థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్నారు. ఉక్రెయిన్లో లో చిక్కుకున్న తమ వారిని రక్షించేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేస్తుంటే. ఆంధ్ర ప్రదేశ్ సిఎం మాత్రం భీమ్లా నాయక్ పై కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారన్నారు బాబు.

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..