మార్కెట్లోకి 2డీజీ ఔషధం.. నీళ్లలో కలిపి తాగేయడమే..

  0
  60

  కరోనా నివారణ చికిత్సలో భాగంగా డీఆర్డోవో అభివృద్ది చేసిన 2డీజీ ఔషధాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ రాణే విడుదల చేసారు. వాస్తవానికి ఈ మందుని క్యాన్సర్ కోసం తయారు చేసినా, కరోనాపై పోరుకోసం మరింతగా అభివృద్ధి చేసి ఇప్పుడు విడుదల చేశారు. పౌడర్ రూపంలో శాచెట్ లుగా దీన్ని మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. తొలి విడతగా 10వేల శాచెట్ లను అందుబాటులోకి తెచ్చారు. డీఆర్డోవో అభివృద్ధి చేయగా, దీన్ని డాక్టర్ రెడ్డీస్ సంస్థ మార్కెట్లోకి తీసుకొస్తోంది.

  ఎలా పనిచేస్తుంది..?
  శరీరంలోని కొవిడ్ వైరస్ కణాలకు గ్లూకోజ్‌ అందకుండా ఈ మందు అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గ్లూకోజ్‌ అందకపోతే కణ విభజన జరగదని.. ఫలితంగా శరీరంలో కరోనా వ్యాప్తి కూడా ఆగుతుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.