కార్ల కంపెనీల అద్భుతమైన ఫైనాన్స్ స్కీమ్ లు..

    0
    338

    కరోనా మహమ్మారి కష్టకాలంలో వివిధ కార్ల కంపెనీలు వినియోగదారులకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వాస్తవానికి కార్ల రేటు కాస్త పెరిగినా, డౌన్ పేమెంట్, ఈఎంఐల విషయంలో ఆఫర్లు ఇస్తున్నాయి. తాజాగా టాటా మోటార్స్ తమ వాహనాల కొనుగోలు సులభతరం చేసేందుకు సరికొత్త ఫైనాన్స్ పథకాలను ప్రవేశపెట్టింది. కోటాక్ మహీంద్రా బ్యాంక్ తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు టాటా ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా, రెడ్ కార్పెట్, ప్రైమ్ విశ్వాస్, వివిధ కస్టమర్ గ్రూపుల (జీతం, స్వయం ఉపాధి, ఆదాయ రుజువు) కోసం తక్కువ ఈఎంలతో మూడురకాల ఫైనాన్స్ స్కీమ్స్ ప్రవేశపెట్టారు. పట్టణ ,గ్రామీణ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాలను ప్రవేశపెట్టారు.

    ఇన్‌కమ్ ప్రూఫ్ ఉన్నవారికి రెడ్ కార్పెట్ ఫైనాన్స్ స్కీమ్ వర్తిస్తుంది. ఈ స్కీమ్‌లో భాగంగా, ఆన్-రోడ్ ధరపై 90 శాతం వరకూ ఫండింగ్‌ను అందిస్తున్నారు. ఇందులో ఏడేళ్ల రుణ వ్యవధి ఉంటుంది. రుణం ప్రీ-పేమెంట్ లేదా పార్ట్-పేమెంట్‌లపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నారు. టాటా సఫారి, టాటా హారియర్, టాటా నెక్సాన్, టాటా ఆల్ట్రోజ్, టాటా టిగోర్ , టాటా టియాగో వంటి వాహనాలను ఈ రెడ్ కార్పెట్ స్కీమ్ కవర్ చేస్తుంది.ఇన్‌ కమ్ ప్రూఫ్ లేని వినియోగదారుల కోసం ప్రైమ్ విశ్వాస్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా, వాహనం ఎక్స్-షోరూమ్ ధరలో వినియోగదారులకు 90 శాతం వరకూ ఫండింగ్, 5ఏండ్ల వరకు రుణ వ్యవధి ఉంటుంది.

    వ్యవసాయ భూమి లేదా ఆస్తి పత్రాల ఆధారంగా రుణం ఇస్తారు.ఈ పథకాన్ని ప్రత్యేకించి స్వయం ఉపాధి లేదా జీతానికి పనిచేసే వారిని దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టారు. ఇందులో వినియోగదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి, మొదటి మూడు నెలల పాటు 50 శాతం వరకు తక్కువ ఈఎం ఐ ఆప్షన్ ఉంటుంది. అంటే,మొదటి 3నెలల పాటు ప్రతి లక్ష రూపాయలకు కనీస ఈఎంఐ రూ.999గా ఉంటుంది. అంతేకాకుండా,ఈ స్కీమ్‌లో భాగంగా కస్టమర్లకు ఆన్-రోడ్ ధరపై 80 శాతం వరకు ఫండింగ్ అందించనున్నారు.

    ఈ కొత్త ఫైనాన్స్ పథకాలను పొందటానికి వినియోగదారులు టాటా మోటార్స్ డీలర్‌షిప్‌లను సందర్శించవచ్చు లేదా టాటా మోటార్స్ వాహనాలను కొనుగోలు చేయడానికి కోటక్ మహీంద్రా ప్రైమ్ బ్రాంచ్‌ ను కూడా సంప్రదించవచ్చు.

    ఇవీ చదవండి..

    లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

    వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

    అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

    కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..