చిల్లర దొంగతనాలు ఒక హాబీగా చేస్తారు.

    0
    74

    కోట్ల రూపాయలు వున్నా చిల్లర దొంగతనాలు చేయాలన్న ఒక ఆలోచన వారికి ఒక హాబీగా మారుస్తుంది. ఈ వ్యాధి పేరు లెప్టో మానియా. ఈ రోగం వున్న వాళ్ళు ఏదైనా వస్తువును చూస్తే కొట్టేయాలనిపిస్తుంది. అది వారికి అవసరం కూడా వుండదు. అలాగే వారు కొట్టేయాలనుకుంటున్న వస్తువు విలువ కూడా చాలా తక్కువగా వుంటుంది. అవసరం లేకపోయినా హోటళ్లలో స్పూన్లు, గ్లాసులు, చివరకు టిష్యూ పేపర్లు కూడా జేబులో పెట్టుకుని వెళ్తుతుంటారు. వైద్య పరిభాషలో దీనినే ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్ అంటారు.

    ప్రపంచంలో అతిపెద్ద బ్యాంకైన సిటీ గ్రూప్ బ్యాంకులో ఏడాదికి 10 కోట్లు జీతం తీసుకునే పరాస్ షా అనే ఎగ్జిక్యూటివ్ బిస్కెట్లు, బర్గర్లు దొంగతనం చేస్తూ ఇటీవల పట్టుబట్టాడు. ఈ చిల్లర దొంగతనానికి ఆయనను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఇలా కోట్ల రూపాయల జీతాలు తీసుకొనే వున్నత స్థాయి వ్యక్తులు దొంగతనం చేయడం కొత్తేమీ కాదు..

    బ్రిటన్ లో బ్లాక్ రాక్ ఎగ్జిక్యూటివ్ జోనాధన్ బర్రోస్ ఏడాదికి 11 కోట్లు జీతం. ఈయన కూడా ఎప్పుడూ రైలులో టిక్కెట్ కొనకుండానే ప్రయాణం చేసేవాడు. రైలులో తోటి ప్రయాణీకుల వస్తువులు కూడా కొట్టేసేవాడు. ఓసారి ఈ విషయం కనిపెట్టిన రైల్వే పోలీసులు కేసు పెట్టి ఆయనకు భారత కరెన్సీలో 40 లక్షల రూపాయలు ఫైన్ వేసి వదిలేశారు.

    మరో ఘటనలో జపాన్ లోని మిజ్వో బ్యాంకులో సుచికో అనే ఎగ్జిక్యూటివ్ జీతం 14 కోట్లు. ఒక ఫ్రెండ్ బైక్ నుంచి 500 రూపాయల విలువ చేసే పార్టును దొంగతనం చేసి ఉద్యోగం ఊడగొట్టుకున్నాడు. కోట్ల రూపాయలు జీతాలు తీసుకునే ఉద్యోగులు ఇలా.. చిల్లర దొంగతనాలు ఎందుకు చేస్తారు. ఇది అలవాటా ? లేక వారిలో మానసికమైన వ్యాధా ? ఇది ఖచ్చితంగా ఒక మానసిక రోగమేనంటున్నారు వైద్యులు..

    ఇవీ చదవండి..

    లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

    వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

    అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

    కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..