ఆత్మహత్యాయత్నంలో కొత్త కోణం ఇది..

  0
  9457

  నెల్లూరు ఎస్పీ ఆఫీస్ ఎదుట జరిగిన ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త కోణం బయటపడింది. ఆ అమ్మాయి రెండో భర్త వద్ద ఉండనని గొడవ చేస్తోందని, కానీ తల్లిదండ్రులు మాత్రం ఆమెను బలవంతంగా కాపురానికి పంపించాలని చూస్తున్నారని దుత్తలూరు సీఐ చెప్పారు. ఈ క్రమంలో తన స్నేహితుడితో కలసి లక్ష్మీప్రసన్న ఆత్మహత్యాయత్నం చేసిందని తెలిపారు.

  దుత్తలూరు మండలం నర్రవాడకు చెందిన లక్ష్మీప్రసన్న, మాలకొండరాయుడు నెల్లూరు ఎస్పీ ఆఫీస్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో పోలీసులు తమను వేధిస్తున్నారంటూ లక్ష్మీప్రసన్న ఆరోపించింది. దీనిపై దుత్తలూరు సీఐ వివరణ ఇచ్చారు. తల్లిదండ్రులతో లక్ష్మీప్రసన్నకు గొడవ ఉందని, ఆమె రెండో భర్తతో కాపురం చేయకుండా స్నేహితుల వద్దకు వెళ్లిపోయిందని చెప్పారాయన. మాలకొండ రాయుడు అనే స్నేహితుడు నిద్రమాత్రలు తెచ్చి ఇచ్చారని అన్నారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?