ఆగస్ట్ 16నుంచి ఏపీలో స్కూల్స్ తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇటీవల కేరళలో కేసులు పెరుగుతున్నాయి, అటు హైదరాబాద్ లో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో స్కూల్స్ తిరిగి తెరుస్తారా లేదా అనే అనుమానాలున్నాయి. దీనిపై మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 16వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం అవుతాయని.. తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జగనన్న విద్యాదీవెనపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆగస్టు 16న రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు తిరిగి ప్రారంభించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని.. ఉపాధ్యాయులకు ఆగస్టు 16లోగా 100శాతం బూస్టర్ డోస్ తో పాటు పూర్తిచేయాలని సీఎం ఆదేశించినట్టు వెల్లడించారు. ఇక, విద్యాకానుక రెండవ సారి అన్ని స్కూళ్ళలో అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్న ఆయన… నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, బెల్టులు 100 శాతం, స్కూలు బ్యాగులు 80 శాతం, యూనిఫాంలు 80 శాతం, డిక్షనరీలు 20 శాతం అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. ఆగస్టు 16 నుంచి కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ స్కూళ్లను ప్రారంభిస్తామని తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్.
ఇవీ చదవండి..
ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?
అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?