జడ్జి హత్య, సీసీ కెమెరాలు బయటపెట్టిన నిజం

  0
  4503

  జిల్లా జడ్జి ప్రాణాలు కోల్పోయింది ప్రమాదంలో కాదు, అది పక్కా ప్లానింగ్ తో చేసిన హత్యేనని రుజువవుతోంది. సీసీ కెమెరాల వీడియోలు బయటకు రావడంతో అసలు నిజం బయటపడింది. ఈ ఘటన జార్ఖండ్ లోని ధన్ బాద్ లో జరిగింది. జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ నిన్న(బుధవారం) ఉదయం 5 గంటల సమయంలో జాగింగ్ కివెళ్లారు. ఈ స‌మ‌యంలో వెన‌కి నుంచి వేగంగా వ‌చ్చిన టెంపో ఆయ‌న‌ను ఢీకొట్టి వెళ్లిపోయింది. టెంపో డ్రైవ‌ర్ కావాల‌నే జ‌డ్జి వైపు వెళ్లి ఢీకొట్టిన‌ట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌యింది. ఈ హ‌త్య‌ను సీరియ‌స్‌గా తీసుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌.. జార్ఖండ్ హైకోర్టు జ‌డ్జితో మాట్లాడారు.

  బుధ‌వారం ఉద‌యం ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌గా మొద‌ట దీనినో ప్ర‌మాదంగానే అంద‌రూ భావించారు. హిట్ అండ్ ర‌న్ కేసు న‌మోదు చేశారు. అయితే తాజాగా బ‌య‌ట‌ప‌డిన సీసీటీవీ ఫుటేజీ ఇది హ‌త్యేన‌ని తేల్చింది. అంతేకాదు ఈ హ‌త్య చేయ‌డానికి కొన్ని గంట‌ల ముందే ఆ వాహనాన్ని దొంగిలించిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఇప్ప‌టికే ఆ డ్రైవ‌ర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి నుంచి అర కిలోమీట‌ర్‌ వెళ్లేలోపే ఉత్త‌మ్ ఆనంద్‌ను ఆ వాహ‌నం ఢీకొట్టింది. చాలాసేప‌టి వ‌ర‌కూ ర‌క్తం మ‌డుగులో ఆయ‌న అలా రోడ్డుమీదే ప‌డి ఉన్న త‌ర్వాత ఓ వ్య‌క్తి గ‌మ‌నించి హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లగా.. అక్క‌డ ఆయ‌న మ‌ర‌ణించారు.

  పోలీసులు గ‌తంలో జడ్జి ఆనంద్ విచార‌ణ జ‌రిపిన కేసుల‌పై దృష్టి సారించారు. ఆయ‌న ధ‌న్‌ బాద్‌ లో ఎన్నో మాఫియా హ‌త్య‌ల కేసుల‌ను చూస్తున్నారు. ఈ మ‌ధ్యే ఇద్ద‌రు గ్యాంగ్‌స్ట‌ర్‌ ల‌కు బెయిల్ కూడా నిరాక‌రించారు. దీంతో ఆ గ్యాంగ్ స్టర్లే ఈ హత్యకు పథకం రచించినట్టు అనుమానిస్తున్నారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?