భీమ్లా నాయక్ రిలీజ్ రోజు కాలేజీలకు సెలవలు..?

  0
  282

  రేపు భీమ్లా నాయక్ రిలీజ్ అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు.. ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో కూడా పవర్ స్టార్ మూవీ విడుదలవుతోంది. అయితే ఇప్పుడేమీ సెలవలు లేవు. పైగా పరీక్షల సీజన్ వచ్చేస్తోంది. దీంతో రిలీజ్ రోజు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారట. ఇక్కడ విశేషం ఏంటంటే… ఈ సినిమా రిలీజ్ రోజు కాలేజీలకు సెలవలిస్తున్నారంటో ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఆంధ్రా యూనివర్శిటీ ఓ ప్రెస్ నోట్ కూడా విడుదల చేసినట్టు వార్తలొచ్చాయి.

  ఆంధ్రా విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఓ ప్రకటన నిన్నటి నుంచి వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. విద్యార్థుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని ‘భీమ్లానాయక్‌’ విడుదల సందర్భంగా శుక్రవారం ఆంధ్రా యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ సెలవు ప్రకటిస్తున్నట్లు అందులో ఉంది. ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన ‘ఫ్యాక్ట్‌చెక్‌’ సెల్‌ అది అబద్ధమని తేల్చేసింది. ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ ఈ విషయంపై స్పందించారు. కొత్త సినిమా విడుదల సందర్భంగా శుక్రవారం సెలవు ప్రకటించినట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదన్నారాయన. సెలవు ప్రకటిస్తూ తాము అధికారిక ప్రకటన విడుదల చేయలేదన్నారు. ఆ ప్రకటన అవాస్తవం అని కొట్టిపారేశారు. ఏపీ ఫ్యాక్ట్ చెక్ సెల్ ఈమేరకు ట్వీట్ చేసింది.

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..