ఏటీఎంలో డబ్బులు పెట్టి తాళాలు కూడా అక్కడే ..

  0
  126

  ఏటీఎం లలో దోపిడీ సంగతెలా ఉన్నా , ఏటీఎం లలో డబ్బులుపెట్టే సిబ్బంది నిర్లక్ష్యం చూడండి.. డబ్బులు పెట్టి , చెస్ట్ కి సంబందించిన తాళాలు , ఏటీఎం పైనే పెట్టి మర్చిపోయారు. కర్నూల్ జిల్లా డోన్ పట్టణంలో జరిగిందీ ఘటన.. ఇటీవలే డోన్ లో ఒక ఏటీఎం ను దొంగలు కొల్లగొట్టారు. ఆ సంఘటన మరువకముందే , సిబ్బంది ఏటీఎం లో డబ్బులు పెట్టి , దాని తాళాలు మర్చిపోయి అక్కడే వదిలేసి పోవడమే విచిత్రం. డోన్ రాజ్‌ థియేటర్‌ కు దగ్గర్లో ఉన్న సిండికేట్‌ బ్యాంక్‌ ఏటీఎంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు వచ్చిన ఓ మంచి వ్యక్తి తాళాలు గుర్తించి వాటిని బ్యాంక్‌ అధికారులకు అప్పగించారు. అదే దొంగల చేతికి ఈ తాళాలు దొరికివుంటే ఏమైయ్యేదో చెప్పనవసరంలేదు..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్