వచ్చేస్తున్నాయి , ఎలెక్ట్రికల్ విమానాలు.. ఎక్కడైనా దిగొచ్చు.

  0
  81

  ఎల‌క్ట్రిక‌ల్ బైక్స్, ఎల‌క్ట్రిక‌ల్ కార్స్, ఈ ఆటోస్… ఇవ‌న్నీ చూశాం. వీటిల్లో తిరిగాం. ఇధ‌నం లేకుండా బ్యాట‌రీ సాయంతో న‌డిచే వాహ‌నాలు. ఇంధ‌న ధ‌ర‌లు ఆకాశాన్ని తాకుతున్న త‌రుణంలో ఇప్పుడిప్పుడే వీటికి కూడా డిమాండ్ పెరుగుతోంది. ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే, ఇప్పుడు స‌రికొత్త‌గా ఎల‌క్ట్రిక‌ల్ ఫ్లైట్స్ రెడీ అవుతుండ‌డం మ‌రో ఎత్తు. అవును ఇప్ప‌టివ‌ర‌కు ఇంధ‌న సాయంతో ఎగిరే విమానాల‌నే చూశాం. కానీ భ‌విష్య‌త్తులో బ్యాట‌రీల సాయంతో ఎగిరే విమానాల‌ను కూడా చూడ‌బోతున్నాం. ఈ త‌ర‌హా విమానాలు కూడా రూపొందుతున్నాయి. అమెరికా కంట్రీలోని కాలిఫోర్నియాలోని జోబీ ఏవియేషన్ వీటిని త‌యారుచేసే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. తాజాగా ఈ ఎల‌క్ట్రిక‌ల్ ఫ్లైట్ ల‌ను నాసా ప‌రీక్షిస్తోంది. వెర్టికల్​ టేకాఫ్​, లాండింగ్​ e VTOL విమానం పరీక్ష నిర్వహిస్తోంది. ఒక్క రీచార్జితో ఈ విమానం 240 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఇవి అందుబాటులోకి వ‌స్తే భ‌విష్య‌త్తులో వీటిని ఎయిర్ ట్యాక్సీలుగా ఉప‌యోగంలోకి రానున్నాయి.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్