ఈ పక్షి అరుపు వింటే ,బిడ్డ ఏడుస్తున్నట్టే ఉంది.

    0
    2082

    లైర్ బ‌ర్డ్… ప్ర‌పంచంలోని అంద‌మైన ప‌క్షుల్లో ఇది కూడా ఒక‌టి. ఆస్ట్రేలియాలో మాత్ర‌మే ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది. అన్ని ప‌క్షుల లాగే ఇది కూడా కూస్తుంది అనుకుంటే పొర‌పాటే. మిగ‌తా ప‌క్షుల కంటే ఇది భిన్న‌మైన‌ది. ఎందుకంటే దీనికి మిమిక్రీ తెలుసు. లైర్ బ‌ర్డ్స్ అనుక‌ర‌ణ చేయ‌డంలోదిట్ట‌.చిన్న‌పిల్ల‌లు ఏడిస్తే ఎలా ఉంటుందో… అలాగే అనుక‌రిస్తుంది. అంతేకాదు త‌నముందు ఎలాంటి శ‌బ్దం వినిపించినా దాన్ని మిమిక్రీ చేయ‌డం ఈ ప‌క్షి స్పెషాలిటీ. అంటే కారు హార‌న్ శ‌బ్దం వినిపిస్తే, కారు హార‌న్ శ‌బ్దం వ‌చ్చేలా కూస్తుంది. తుపాకీ పేలిన శ‌బ్దం వినిపిస్తే, ఆ శ‌బ్దం వ‌చ్చేలా కూస్తుంది. ప‌క్షులు, జంతువులు ఇలా ఒక‌టేమిటి ఎన్నోర‌కాల శ‌బ్దాల‌ను ఇది అనుక‌రిస్తుంది.

    మగ పక్షి తోక చాలా అందంగా ఉంటుంది. శీతాకాలంలో మగ పక్షి పాట పాడటం ద్వారా ఆడవాటిని ఆకర్షిస్తుంది. ఆడ ప‌క్షి ఒక్క గుడ్డు మాత్రమే పెట్టి, 50 రోజులు పొదుగుతుంది, ఆ తరువాత పక్షిపిల్ల దాని నుండి బయటకు వస్తుంది. ఆడది ఆ పిల్లపక్షిని చూసుకుంటుంది. ఈ పక్షి కీటకాలు, వానపాములు, సాలెపురుగులు తింటుంది. ఇది పిరికి పక్షి

    పిల్లాడు లాగా ఏడుపునే కాదు, ఇతర పిట్టలు , జంతువుల శబ్దాలను కూడా బ్రహ్మండంగా ఇమిటేట్ చేస్తోంది .చూడండి..

    ఇవీ చదవండి..

    రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

    ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్