నారాయ‌ణ‌కు మ‌రోసారి ఊర‌ట‌.

  0
  108

  పేప‌ర్ లీకేజీ కేసులో నారాయ‌ణ‌కు మ‌రోసారి ఊర‌ట‌…
  బెయిల్ ర‌ద్దు పిటీష‌న్‌పై విచార‌ణ‌ వాయిదా..
  =================
  టెన్త్ ఎగ్జామ్స్ పేప‌ర్ లీకేజీ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి నారాయ‌ణకు మంజూరు చేసిన బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌న్న పిటిష‌న్‌పై విచార‌ణ‌ను చిత్తూరు కోర్టు జూన్ 24కు వాయిదా వేసింది. ఈ కేసులో హైద‌రాబాద్‌లో నారాయ‌ణ‌ను అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు చిత్తూరు కోర్టులో హాజ‌రుప‌రిచారు.

  అయితే ఈ కేసులో నారాయ‌ణ‌కు జ్యూడిషియ‌ల్ రిమాండ్ అవ‌స‌రం లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డ కోర్టు.. అప్ప‌టిక‌ప్పుడే బెయిల్ మంజూరు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో నారాయ‌ణ బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. ఆ త‌ర్వాత నారాయ‌ణ‌కు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ పోలీసులు చిత్తూరు కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

  ఈ పిటిష‌న్‌పై ఇప్ప‌టికే ఓసారి విచార‌ణ జ‌రిగింది. తాజాగా మంగ‌ళ‌వారం కూడా దీనిపై చిత్తూరు కోర్టు విచార‌ణ చేప‌ట్టింది. విచార‌ణ సంద‌ర్భంగా పోలీసుల వాద‌న‌తో పాటు నారాయ‌ణ త‌ర‌ఫు వాద‌న‌ల‌ను విన్న న్యాయ‌స్థానం.. త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 24కు వాయిదా వేసింది.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..