ఆ సినిమా చూసి ఏడ్చేసిన ముఖ్యమంత్రి బొమ్మై..

  0
  213

  క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి బసవరాజ్ బొమ్మై ‘777 చార్లీ’ సినిమా చూసి విల‌పించారు. ఆ సినిమా చూసిన త‌ర్వాత ఆయ‌న తీవ్ర ఉద్వేగానికి లోన‌య్యారు. దుఖాన్ని ఆపుకోలేక క‌న్నీటి పర్యంత‌మ‌య్యారు. ఆ సినిమా చూస్తున్నంతసేపు.. త‌మ పెంపుడు కుక్క గుర్తుకు వ‌చ్చింద‌న్నారు. 14 ఏళ్ళ పాటు బొమ్మై కుటుంబంతో ఉన్న పెంపుడు కుక్క గ‌తేడాది చ‌నిపోయింది. కుక్క చ‌నిపోయిన‌ప్పుడు కూడా బొమ్మై దానికి పూల‌మాల వేసి తుది నివాళులు అర్పిస్తూ.. ముద్దు పెట్టి ఏడ్చేశారు.

  ర‌క్షిత్ శెట్టి కీల‌క‌పాత్ర‌లో కిర‌ణ్ రాజ్ తీసిన ఈ సినిమా.. క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాళ భాష‌ల్లో విడుద‌లైంది. శున‌కానికి, మ‌నిషికి ఉన్న అనుబంధాన్ని, ఆత్మీయ‌త‌ను ఒక ఎమోష‌న‌ల్ డ్రామాగా ఈ సినిమాలో చూపించారు. ఈ చిత్రంలో శున‌కం క‌ళ్ళ‌ల్లోని హావ‌భావాలు చూస్తే త‌న పెంపుడు కుక్క గుర్తుకు వ‌చ్చింద‌ని ఆయ‌న క‌న్నీరు పెట్టుకున్నారు. బొమ్మై ముఖ్య‌మంత్రి కావడానికి కొద్దిరోజుల ముందే ఆయ‌న పెంపుడు శున‌కం చ‌నిపోయింది.

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..