జగన్ కుమార్తెల గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది..?

    0
    1547

    సాక్షి పత్రికపై వేసిన పరువు నష్టం దావా విచారణలో భాగంగా టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ విశాఖ కోర్టుకి హాజరయ్యారు. అవతలి వ్యక్తులు కావాలనే కేసు విచారణలో ఆలస్యం చేస్తున్నారని అన్నారు. అదే సమయంలో గతంలో తన తల్లిపై చేసిన వ్యాఖ్యలపై కూడా లోకేష్ స్పందించారు.

    శాసనసభ సాక్షిగా తన తల్లిని అవమానించారని. వైఎస్ విజయలక్ష్మి గురించి, వైఎస్‌ భారతి గురించి, జగన్‌ కుమార్తెల గురించి తాము మాట్లాడితే ఎలా ఉంటుందో వాళ్లు ఆలోచించుకోవాలని హితవు పలికారు. తమ సంస్కృతి అది కాదని, ఓ తల్లి ఎలా బాధపడుతుందో కొడుకుగా చూశానని చెప్పారు. అవమానకరంగా మాట్లాడినవారు క్షమాపణ చెప్పే వరకు వారిని వదిలిపెట్టనన్నారు లోకేష్. ఆ విథంగా తన తల్లికి తాను మాటిస్తున్నానని, శపథం చేస్తున్నానని చెప్పారు.

    “నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి సాక్షి నాపై దాడి చేస్తోంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించి నాపై బురద జల్లింది. 2019 అక్టోబరులో ‘చినబాబు చిరుతిండి 25 లక్షలండి’ అనే శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితం అయింది. దాన్ని చూసి మరో ఆంగ్ల పత్రిక, మరో నేషనల్‌ మ్యాగజీన్ ఈ కథనాన్ని ప్రచురించాయి. ఆ ముగ్గురికి నేను నోటీసులు జారీ చేశాను. అనంతరం మ్యాగజీన్‌ క్షమాపణ కోరింది. కానీ సాక్షి గానీ, మరో పత్రిక గానీ ఎక్కడా వివరణ ఇవ్వలేదు. నేను విషయంపై వివరణ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని వాళ్లు పబ్లిష్‌ చేయలేదు. అందుకే నేను సాక్షిపై పరువునష్టం దావా వేశాను. ఇది ఇక్కడితో ఆగదు. తప్పకుండా న్యాయ పోరాటం చేస్తా.” అని అన్నారు నారా లోకేష్.

    ఇవీ చదవండి… 

    బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

    మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

    నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

    తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..