బీమ్లానాయక్.. జాగ్రత్త.. థియేటర్ల దగ్గర మేమే ఉంటాం..

  0
  176

  భీమ్లా నాయక్ సినిమాపై ఏపీ సర్కార్ ఆంక్షలు విధించింది. థియేటర్ల యజమానులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏపీలో నాలుగు షోలకు మించి వేస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తూ థియేటర్ల యజమానులకు ప్రభుత్వ అధికారుల నుంచి నోటీసులు వెళ్లాయి.

  టిక్కెట్ల రేట్లు కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే అంగీకరించబోమని అంటున్నారు అధికారులు. నిబంధనలు అతిక్రమిస్తే సినిమాటోగ్రఫీ చట్టం1952 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. థియేటర్ల వద్ద రెవెన్యూ అధికారుల నిఘా ఉంటుందని చెబుతున్నారు.

  ఇదిలా ఉండగా తెలంగాణాలో మాత్రం భీమ్లా నాయక్ సినిమాకు ఐదో షో వేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనిపై రాజకీయంగా ఏపీలో చర్చ జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం ఏపీ ప్రభుత్వం పేరు చెప్పకుండా.. అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య మడమతప్పని పోరాటం చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు.

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..