జగన్ గారూ , కొడాలి నానిని పెట్టి సినిమా తీసుకోండి..

    0
    81

    చరిత్రలో చంగీస్ ఖాన్, హిట్లర్ వంటి నియంతలెవరో మట్టిలో కలిసి పోయారని, మీరేమైనా మహారాజులు అనుకుంటున్నారా.. ఉత్తరకొరియా, రష్యా పాలకుల మాదిరిగా శాశ్వతమనుకుంటున్నారా అంటూ చిరంజీవి తమ్ముడు నాగబాబు సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. మీకు ఇంకో రెండేళ్లే టైముంది. అది గుర్తుంచుకొని.. ఇప్పటికైనా మంచిపాలన అందించాలంటూ హితబోధ చేశారు. ఇది ప్రజాస్వామ్యం, మీలాంటి వారు ఉంటారనే ఐదేళ్లకోసారి ఎన్నికలు పెడతారని అన్నారు. ఈ విషయం గుర్తుంచుకోవాలన్నారు. సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తే పవన్ కళ్యాణ్ మీ వద్దకు వచ్చి, దండాలు పెట్టడం జరగదని.. అది కలలో కూడా జరగదని అన్నారు.

    పగ ప్రతీకారాలు మానేసి, మిగిలిన రెండేళ్లయినా అందరూ మెచ్చే పాలన చేయాలనీ అన్నారు. మీగురించి, మీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారో తెలియాలంటే.. మాయాబజారులో మాయాపీఠం వంటి దాన్ని ఎక్కిస్తే నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. సినిమా వాళ్ళను మీరు ఏమీచేయలేరని, అంతగా ఉంటే ఏపీ వరకూ సినిమాలను ఓటీటీల ద్వారా వ్యాపారం చేసుకోవచ్చని అన్నారు. మెగా ఫాన్స్ కూడా ఆవేశంతో మాట్లాడకుండా ఉండాలని, ఆవేశాన్ని అణచుకోవాలని అన్నారు. ఎన్నికల్లో ఆ ఆవేశాన్ని చూపిద్దామని చెప్పారు. అధికారం శాశ్వతమని భ్రమల్లో ఉండొద్దని కూడా వైసీపీకి సూచించారు. వెల్లంపల్లిని, కొడాలినానిని కూడా హీరోలుగా పెట్టి సినిమాలు తీసుకోవచ్చని చివరగా పంచులేశారు.

    ఇవీ చదవండి… 

    బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

    మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

    నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

    తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..