ఈ భార్యా భర్తల జీవితం ఆ వ్యానులోనే..

    0
    941

    ఈ భార్యా భర్తల జీవితం ఆ వ్యానులోనే గడిచిపోతోంది. ఈ వ్యానులోనే ప్రేమ, పెళ్లి, పిల్లలు, వారి పెంపకం.. ఇలా అన్నీ గడిచిపోతున్నాయి. జర్మనీకి చెందిన ఈ భార్యా భర్తలు గత 12 ఏళ్లుగా ఒక వ్యానులోనే ప్రపంచమంతటా చుట్టేస్తున్నారు. ఇప్పటికి 91 దేశాలు తిరిగేశారు. ఇప్పటివరకూ వారి జీవితకాలంలో యాభై శాతం ఈ వ్యానులోనే గడచిపోయింది. బెంజ్ కంపెనీకి చెందిన 911కు చెందిన ట్రక్ ను వారు క్యారవాన్ గా మార్చుకున్నారు. కిచెన్, బాత్రూం, ఇలా అన్నీ ఆ వ్యాన్ లోనే.. సైట్ సీయింగ్ కోసం కూడా అందులోనే ఏర్పాట్లు చేసుకున్నారు.

    భర్త త్రొబెన్ ఇంజనీర్, భార్య నిచి రచయిత.  ప్రపంచాన్ని చుట్టి రావాలనేది ఇద్దరికోరిక కాబట్టి.. ప్రేమించుకున్నప్పటి నుంచి మొదలైన వీరి ప్రపంచ ప్రయాణం.. పెళ్ళై.. పిల్లలు కలిగి..వారు పెద్దవారవుతున్నా కొనసాగుతోంది. ప్రస్తుతానికివారికి తొమ్మిదేళ్ల కూతురు, ఆరేళ్ళ కొడుకు ఉన్నారు. ఇప్పుడు భారత పర్యటనలో ఉన్న ఈ జంట ప్రస్తుతం కేరళలో పర్యటిస్తోంది.అక్కడినుంచి తమిళనాడుకు వెళ్లనున్నారు. 12 ఏళ్లుగా ఒకే వ్యానులో 91 దేశాలు చూశారంటే వీరిద్దరిని సూపర్ ట్రావెలింగ్ కపుల్ గా చెప్పుకోవచ్చు.

     

    ఇవీ చదవండి… 

    బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

    మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

    నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

    తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..