తన భార్య ఆడది కాదని ఓ భర్త మొర విన్న సుప్రీం కోర్టు..

    0
    574

    తన భార్య ఆడది కాదు, మగాడని నిరూపించుకునేందుకు ఓ అమాయక భర్త సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాటం చేస్తున్నాడు. చట్టంలోని కొన్ని లొసుగులు, గృహ హింస నిరోధక చట్టం.. ఇలాంటివన్నీ మగాడిగా పుట్టి ఆడదాన్ని అని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్న ఆ మహిళకు వరాలయ్యాయి. తాజాగా ఈ కేసు సుప్రీంకోర్టుకి వచ్చింది. మొదట్లో ఈ కేసుని తీసుకోడానికి ఇష్టపడని సుప్రీంకోర్టు ఆ తర్వాత న్యాయవాది ఎంకే మోదీ తీవ్ర ప్రయత్నాలతో ఈ కేసుని స్వీకరించేందుకు అంగీకరించింది. వెంటనే ఈ కేసు విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కనపెట్టాల్సిందిగా స్పష్టం చేసింది.

    కేసుకి సంబంధించిన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ కి చెందిన ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. నెల రోజుల తర్వాత శోభనానికి సిద్ధమయ్యాడు. అయితే తన భార్య మహిళ కాదని, మగాడేనని అప్పటికి కాని అతనికి అర్థం కాలేదు. ఈ కారణంగానే నెలరోజులపాటు శోభనం కార్యక్రమం కూడా వాయిదా వేసుకున్నాడు. దీంతో ఆ భర్త గ్వాలియర్ కోర్ట్ లో తన భార్యపై చీటింగ్ కేసు నమోదు చేయాలని తాను పెళ్లి చేసుకున్నది మహిళ కాకుండా మగాడని, అందువల్ల చట్టపరంగా విడాకులు కూడా ఇప్పించాలని కోరాడు. ఈ మేరకు వైద్య నివేదికలను కూడా సమర్పించాడు. గ్వాలియర్ కోర్టు భర్తకు అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే ఆ హిజ్రా భార్య భర్తపై గృహ హింస నిరోధక చట్టం కింద కేసు పెట్టింది. తనను కట్నం కోసం వేధిస్తున్నాడని ఆరోపణ చేసింది. ఈ కేసు పోలీసులు తీసుకోకపోవడంతో హైకోర్టుని ఆశ్రయించింది.

    హైకోర్టు గ్వాలియర్ కోర్టు ఇచ్చిన తీర్పుని రద్దు చేస్తూ ఆ భర్తని అరెస్ట్ చేయాలని గృహ హింస నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి తమకు పంపించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అభాగ్యుడైన ఆ భర్త, హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. తన భార్య మహిళ కాదని, మగాడని ఎంత చెబుతున్నా ఎవరూ నమ్మడంలేదని, మగాడిగా ఉండి మోసం చేసి తనను పెళ్లి చేసుకుని, తనపై గృహ హింస చట్టం కింద కేసు పెట్టడం న్యాయం కాదని, న్యాయవాది ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్లాడు. సుప్రీంకోర్టులో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, ఎంఎం సురేష్ ఆధ్వర్యంలోని బెంచ్ ఈ కేసుని విచారణకు స్వీకరించి మధ్యప్రదేశ్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుని పక్కనపెట్టింది.

    మోసం చేసి పెళ్లి చేసుకున్నట్టు తాము అభిప్రాయపడుతున్నామని చెప్పింది. గృహ హింస నిరోధక చట్టంకింద పెట్టిన కేసుల్ని కూడా రద్దు చేయాలంటూ ఆదేశాలిచ్చింది. వివాహం మోసంతో జరిగినందున భార్య కూడా తన మగతనాన్ని దాచిపెట్టి, ఆడదాన్నంటూ పెళ్లి చేసుకోవడం మోసపూరితమైన చర్యగా అభిప్రాయపడింది. ఇందులో విచిత్రం ఏంటంటే.. చట్టం ప్రకారం తాను ఆడ, లేదా మగ అని చెప్పుకునే హక్కు వ్యక్తులకే ఉంటుంది. దానికి జననేంద్రియాలకు సంబంధం లేదు. ఈ ఒక్క లొసుగుతో మహిళని అని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్న హిజ్రా, ఆ అమాయకపు భర్తను ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది.

     

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..