వార్న్ మరణంపై మిస్టరీ వీడింది..

  0
  374

  ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్ మరణంపై ఇటీవల పుకార్లు మొదలయ్యాయి. ఆయన హోటల్ రూమ్ లో రక్తపు మరకలు ఉన్నాయనే వార్త బయటకు రావడంతో ఆయన మరణానికి కారణం ఏమై ఉంటుందా అనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే చివరకు ఆయనది సహజ మరణమేనని థాయ్‌ లాండ్ పోలీసులు ప్రకటించారు. ఈరోజు వార్న్‌ మృతదేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించిన అనంతరం.. ఆయనది సహజ మరణమేనని వైద్యులు నిర్ధారించారని పోలీసులు వెల్లడించారు.

  వార్న్‌ మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించిన వైద్యులు అందించిన నివేదికను.. వార్న్‌ కుటుంబ సభ్యులకు, ఆస్ట్రేలియా రాయబార కార్యాలయానికి పంపించారు. వార్న్‌ హఠాన్మరణంపై ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని వెల్లడించారు. అయితే, వార్న్‌ మృతదేహాన్ని ఆస్ట్రేలియాకు ఎప్పుడు పంపుతారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

  థాయ్‌లాండ్‌లోని రెండో అతి పెద్ద ద్వీపమైన కోహ్‌ సమూయిలోని తన రిసార్ట్‌లో శుక్రవారం.. అచేతనంగా పడి ఉన్న వార్న్‌ని తన వ్యక్తిగత సిబ్బంది హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. ఆయనను బతికించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయిన విషయం తెలిసిందే.

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..