ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. రాధేశ్యామ్ ప్రీమియర్ షో లు క్యాన్సిల్..

  0
  209

  ప్రభాస్ అభిమానులకు నిజంగా ఇది బ్యాడ్ న్యూసే.. రాధేశ్యామ్ సినిమా ప్రీమియర్ షో లు క్యాన్సిల్ అయ్యాయి. సినిమా రిలీజ్ రోజు అంటే మార్చి 11న మాత్రమే సినిమా షో లు పడబోతున్నాయి. విడుదలకు ఒకరోజు ముందు అంటే మార్చి 10న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశ వ్యాప్తంగా పెయిడ్ ప్రీమియర్స్ వేయాలని అనుకున్నారు నిర్మాతలు. అయితే చివరి నిముషంలో ఆ నిర్ణయం విరమించుకున్నారు.

   

   

  తెలంగాణ రాష్ట్రంలో ఐదు షోలకు అనుమతి ఉండటంతో శుక్రవారం (మార్చి 11) తెల్లవారుజామున 4:00 గంటలకు షోలు ప్రారంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రభుత్వం జారీ చేసే కొత్త జీవో పై షో లు ఆధారపడి ఉంటాయి. ‘రాధేశ్యామ్’ విడుదలకు ముందే ఏపీ సర్కారు సినిమా షో లకు సంబంధించి కొత్త జీవో ఇస్తుందని అనుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే ప్రభాస్ సినిమా ఏపీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ నమోదు చేస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.

  కాగా 1970స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ లవ్ డ్రామాగా ”రాధేశ్యామ్” చిత్రం తెరకెక్కింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లపై వంశీ – ప్రమోద్ – ప్రసీద నిర్మించారు. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇందులో హస్త సాముద్రికా నిపుణుడు విక్రమాదిత్యగా ప్రభాస్.. ప్రేరణగా పూజా కనిపించనున్నారు. కృష్ణంరాజు – భాగ్యశ్రీ – మురళీ శర్మ – సచిన్ ఖేడ్కర్ – జయరామ్ – ప్రియదర్శి – సత్యరాజ్ – కునాల్ రాయ్ కపూర్ – ఎయిర్ టెల్ శాషా ఛత్రి – రిద్ది కుమార్ – సత్యన్ కీలక పాత్రలు పోషించారు.

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..