పాత, చినిగిన నోట్లను ఎలా మార్చుకోవాలో తెలుసా..?

    0
    846

    మరకలు పడిన నోట్లు, చిరిగిన నోట్లు ఇస్తే కొత్త నోట్లు ఇస్తామంటూ కొంతమంది ప్రచారం చేసుకుంటుంటారు. చిరిగిన 100 రూపాయల నోటిస్తే 50 రూపాయలు చేతికిస్తారు. ఆ తర్వాత వారు బ్యాంకుల్లో దాన్ని మార్చేసుకుంటారు. బ్యాంకుల్లో చిరిగిన నోట్లు తీసుకుంటారనే విషయం తెలియక చాలామంది ఇలాంటి వారి చేతుల్లో మోసపోతుంటారు. అయితే అన్ని సందర్భాల్లో బ్యాంకులు చిరిగిన నోట్లను తీసుకోవు. గతంలో ఆర్బీఐ రీజనల్ ఆఫీసుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో నోట్లను మార్చేవారు. ఇప్పుడు ప్రతి బ్యాంకులోనూ చిరిగిన నోట్లను తీసుకోవాలని ఆదేశాలిచ్చింది.

    2020 జులై 1న మాస్టర్ సర్కులర్ ఫెసిటిలీ ఫర్ ఎక్స్ చేంజ్ ఆఫ్ నోట్స్ అండ్ కాయిన్స్ అనే నిబంధన తీసుకొచ్చింది ఆర్బీఐ. రెండుకంటే ఎక్కువగా చినిగిపోయినా, లేదా ఏదైనా కొంతభాగం కాలిపోయినా, మిస్ అయిపోయినా దాన్ని మ్యుటిలేటెడ్ నోట్ అంటారు. వీటిని బ్యాంకుల్లో ఎక్స్ చేంజ్ చేసుకోవచ్చు. 5 వరకు ముక్కలు ముక్కలైన నోట్లను కూడా బ్యాంకుల్లో ఎక్స్ చేంజ్ చేసుకోవచ్చు.

    ఇలా చిరిగిన నోట్లను మార్చుకునేందుకు ఏ బ్యాంక్ కూడా నిరాకరించడానికి వీల్లేదు. ఒకవేళ బ్యాంకులు(నాన్ చెస్ట్ బ్రాంచ్ లు) వాటిని ఎక్స్ చేంజ్ చేయలేకపోతే, ఇతర పెద్ద బ్రాంచ్ లకు (చెస్ట్ బ్రాంచ్ లు) పంపించాలి. వాటి వద్దనుంచి వచ్చిన కొత్త నోట్లను పాత నోట్లు ఇచ్చినవారికి ఇవ్వాల్సి ఉంటుంది. 30రోజుల్లోగా కొత్త నోట్లను తిరిగివ్వాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.

    ఇవీ చదవండి..

    రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

    ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్