లవర్స్ తో వేగలేక, నో కిస్సింగ్ జోన్ పెట్టారు.

  0
  86

  ఇచ్చ‌ట మూత్ర విస‌ర్జ‌న చేయ‌రాదు… ఇక్క‌డ వాహ‌నాలు నిలుప‌రాదు… ఇక్క‌డ పోస్ట‌ర్లు అంటించ‌రాదు… వంటి బోర్డులు, గోడ‌ల మీద రాత‌లు చూసుంటారు. కానీ ఇప్పుడు విచిత్ర‌మైన సైన్ బోర్డ్ అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. అదే ఇచ్చ‌ట ముద్దులు పెట్టుకోరాదు. ఇది నో కిస్సింగ్ జోన్. అనే పెద్ద అక్ష‌రాల‌తో రోడ్డు మీద రాశారు. ముంబైలోని బోర‌విల్లి హౌసింగ్ కాల‌నీలో ఆ కాల‌నీ ముందు రోడ్డులో ఎప్పుడూ వాహ‌నాలు నిలిచిఉంటాయి. అది పార్కింగ్ ప్లేస్. ద‌ట్టంగా చెట్లు కూడా ఉంటాయి. ఒక‌ర‌కంగా సేఫ్ జోన్ కూడా. ఎక్క‌డెక్క‌డి ప్రేమికులంతా అక్క‌డికి చేరుకుని క‌బుర్ల‌తో కాల‌క్షేపం, ముద్దుముచ్చ‌ట్లు సాగిస్తున్నారు. ఆ కాల‌నీవాసుల‌కు ఈ ప్రేమికుల ముద్దులు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. దీంతో హౌసింగ్ కాల‌నీ రోడ్డు మీద పెద్ద అక్ష‌రాల‌తో నో కిస్సింగ్ జోన్ అని రాసేశారు. మ‌రికొన్ని ద‌గ్గ‌ర్ల అమ్మాయి, అబ్బాయిల బోర్డులు పెట్టి నో కిస్సింగ్ జోన్ అని బోర్డులు పెట్టారు. క‌రోనా విజృంభిస్తున్న నేప‌ధ్యంలో ముద్దులు కూడా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని మ‌రికొన్ని సూక్తులు కూడా రాశారు. ఇప్పుడీ సైన్ బోర్డులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?