నేనెవడితో ఉంటే మీకెందుకు.. ? అది నా పర్సనల్.

  0
  15226

  భర్త నుంచి విడిపోయిన ఏడాదికి ఆరవ నెల గర్భంతో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మరియు సినీనటి నజరాత్ జహాన్ తన వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని ఒక ప్రకటన విడుదల చేసింది. తన భర్త నిఖిల్ జైన్ నుంచి విడిపోవడంపై ఆమె ఒక ప్రకటన విడుదల చేసింది.

  ఒక బీజేపీ నాయకుడు సినీనటుడు అయిన యాష్ దాస్ గుప్తాతో ఆమె అక్రమ సంభందం కొనసాగిస్తూ గర్భం దాల్చిందని పుకార్లు ఇటీవల వచ్చిన విషయం తెలిసిందే.. అసలు తమ పెళ్లే చెల్లదని తేల్చి పారేసింది. టర్కీలో జరిగిన తమ పెళ్ళికి విలువలేదని తాను ముస్లిం అయిఉండి.. హిందువును పెళ్లి చేసుకున్నప్పుడు అది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద భారత్ లో రిజిస్టర్ కావాలని.. కానీ రిజిస్టర్ కాలేదు కనుక పెళ్లి చెల్లదని తేల్చిపారేసింది.

  ఒకరకంగా చెప్పాలంటే సినిమాలో పెళ్లి సీన్ లాగానే జరిగిందని.. అందువలన విడాకుల ప్రసక్తి కూడా లేదని చెప్పేసింది. తామిద్దరిదీ ఒక రకంగా సహజీవన సంభందం మాత్రమేనని పేర్కొంది. తమ పెళ్ళికే చట్ట బద్ధత లేనప్పుడు.. అది చట్టం దృష్టిలో పెళ్లి కానప్పుడు తన వ్యక్తిగతజీవితం గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదంది. గర్భం దాల్చడంపై కూడా ఆమె సమర్ధించుకుంది.

  తన డబ్బును దోచుకున్నారు తప్ప.. కోటీశ్వరుడని అనుకుంటున్న సునీల్ జైన్ ను ఉద్దేశించి చెప్పింది. తన బట్టలు, వ్యక్తిగత నగలు, అన్నీ ఆ ఇంట్లోనే ఉన్నాయని భర్తను ఉద్దేశించి చెప్పింది. సునీల్ జైన్ కోటీశ్వరుడు కాబట్టి.. తాను వలలో వేసుకున్నానని అనడం సమంజసం కాదని చెప్పింది. 2019 జూన్ నెలలో టర్కీలో వీరి పెళ్లి జరిగింది. క్రైస్తవ, ముస్లిం, హిందూ సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరిగింది. మూడు మతాల సంప్రదాయాల్లో పెళ్లి జరిగినా, ఈమె మాత్రం ఆ పెళ్ళికి చట్టబద్ధతే లేదంటోంది.

  ఇవీ చదవండి..

  నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

  ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

  అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

  నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..