కడుపున పుట్టిన కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అమ్మ… అమ్మ పదానికే కళంకం తెచ్చింది. తన అవసరాలకు బిడ్డని ఆటబొమ్మను చేసింది. కూతురిని అంగడి సరుకుగా మార్చి సొమ్ము చేసుకుంటుంది. చివరికి కటకటాల పాలయ్యింది. తమిళనాడు రాష్ట్రంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
చెన్నైలోని ఈరోడ్‌లో ఓ మహిళ తన 12 కూతురుతో నివసిస్తోంది. భర్త వదిలేయడంతో మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నెరుపుతోంది. గుండెలో దాచుకోవాల్సిన బిడ్డను తన అవసరాల కోసం, జల్సాల కోసం.. వీధిన పెట్టింది. ప్రియుడితో కలిసి సొంత కూతురి అండ కణాలను అమ్మి సొమ్ము చేసుకుంటోంది. మరో మహిళతో కలిసి కూతురి అండ కణాలను విక్రయిస్తూ .. బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తోంది. ఇలా గత నాలుగేళ్ళలో 8 సార్లు కూతురి అండ కణాలను విక్రయించింది.
తల్లి చేస్తోన్న ఘోరాలను ఇన్నాళ్ళు భరిస్తూ వచ్చిన ఆ బిడ్డ.. ఇంక తట్టుకోలేక వేరే ప్రాంతంలో ఉండే బంధువల ఇంటికి వెళ్ళింది. తన దీనావస్థను, తల్లి వల్ల పడుతున్న బాధలను వెళ్ళగక్కి కన్నీటి పర్యంతమైంది. దీంతో బంధువులు పోలీసులకు సమాచారం అందచేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కర్కశంగా వ్యవహరిస్తోన్న తల్లిని, ఆమె ప్రియుడిని, మరో మహిళలను అరెస్ట్ చేశారు. విచారణ చేపట్టగా.. విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి.
కూతురు ఆధార్ కార్డులో పేరు.. పుట్టిన తేదీ.. వయసు.. అన్నీ మార్చేసింది ఆ తల్లి. అంతేకాదు.. కూతురికి పెళ్ళయిందని ఫేక్ సర్టిఫికెట్ కూడా సృష్టించింది. ఇవన్నీ అడ్డం పెట్టుకుని కూతురి జీవితాన్ని సర్వ నాశనం చేసింది. అరెస్టు చేసిన ముగ్గురిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు పోలీసులు.