బిడ్డలకు తండ్రి , లేదా తల్లి ఎవరన్న విషయం తేల్చుకునేందుకు డీఎన్ ఏ టెస్ట్ చెయ్యడం సహజం.. అయితే ఇక్కడ , ఒక దున్నపోతుకు , దాని యజమాని ఎవరనే విషయమై డిఎం ఏ టెస్టుకు పోలీసులు నిర్ణయించారు. దీనికోసం , ఆ దున్నపోతు , శాంపిల్స్ తీసి , డిఎన్ ఏ నిర్దారణ కోసం పంపించారు. మీరట్ లో చంద్రపాల్ కశ్యప్ అనే రైతుకు చెందిన మూడేళ్ళ దున్నపోతు , రెండేళ్ల క్రితం తప్పి పోయింది.
ఇటీవల అది సహరాన్పూర్ జిల్లా మెరపూర్ లో సత్పాల్ సింగ్ అనే రైతు ఇంట్లో ఉందని సమాచారం వచ్చింది. చంద్రపాల్ కశ్యప్ అక్కడికెళ్లి చూసిన తరువాత , అది తనకు చెందిన దున్నపోతేనని నిర్దారణకు వచ్చాడు. కొన్ని గుర్తులు ఆధారంగా ఈ నిర్దారణకు వచ్చానన్నారు. పోలీసు స్టేషన్లో కేసు పెట్టాడు. సత్పాల్ సింగ్ మాత్రం అది తమదేనని వాదించాడు దాని తల్లి ఇప్పటికీ , తనవద్దనే ఉందని , చంద్రపాల్ కశ్యప్ చెప్పడంతో , పోలీసులు దాని యజమాని ఎవరో తేల్చేందుకు డీఎన్ ఏ పరీక్షకు నిర్ణయించారు.