తల్లి అక్రమ సంబంధం చూడలేకే కాల్చి చంపేశా ..

  0
  1956

  ప‌బ్జీ గేమ్ మోజులో డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని త‌ల్లిని చంపాడ‌ని ఓ 16 ఏళ్ళ బాలుడిపై మోపిన కేసు ఇప్పుడు కీల‌క మ‌లుపు తిరిగింది. ఇది ఆ బాలుడి ప‌బ్జీ ఆన్ లైన్ గేమ్ కి సంబంధం లేద‌ని, త‌ల్లి అక్ర‌మ సంబంధాన్ని క‌ళ్ళ‌తో చూడ‌లేక‌.. ఆ బాలుడే త‌ల్లిని కాల్చి చంపాడ‌ని తేలింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో సంచ‌ల‌నం క‌లిగించిన ఈ కేసులో నిప్పు లాంటి నిజాలు ఇప్పుడు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈనెల 4న 16 ఏళ్ళ బాలుడు .. సాధ‌నా సింగ్ అనే త‌న త‌ల్లిని కాల్చి చంపాడ‌ని వార్త‌లొచ్చాయి. త‌ల్లి ఆన్ లైన్ ప‌బ్జీ గేమ్ ను ఆడ‌నివ్వ‌కుండా అడ్డుకోవ‌డం వ‌ల్ల‌నే అత‌ను త‌ల్లిని కాల్చి చంపాడ‌ని వార్త‌లొచ్చాయి. అయితే ఇప్పుడు ఈ కేసు కీల‌క మ‌లుపు తిరిగింది.

  మృతురాలు సాధ‌నాసింగ్ భ‌ర్త న‌వీన్ బీహార్ లోని అస‌న్ సోల్ లో సైన్యంలో ప‌ని చేస్తున్నాడు. ఆమెకు ఓ వ్యాపారితో అక్ర‌మ‌సంబంధం ఏర్ప‌డింది. వార‌ణాసిలో ఉన్న మేన‌మామ ఇంట్లో సెల‌వుల‌కు వెళ్ళి తిరిగొచ్చిన బాలుడికి త‌ల్లి అక్ర‌మ‌సంబంధం గురించి అనుమానం వ‌చ్చింది. త‌ల్లి మొబైల్ ఫోన్‌లో కొన్ని కాల్ రికార్డులు, వీడియోలు చూశాడు. వాటిని త‌న తండ్రికి పంపించాడు. ఆత‌ర్వాత ఫోన్ చేసి త‌ల్లి చేస్తోన్న అనైతిక ప‌నుల‌ను తండ్రికి చెప్పి తొంద‌ర‌గా సెల‌వు పెట్టి ఇంటికి వ‌చ్చి త‌ల్లిని స‌రిదిద్దాల‌ని కోరాడు. ఇంటికొచ్చిన భ‌ర్త .. భార్య‌కు కాల్ రికార్డులు, వీడియోలు చూపించి నిల‌దీశాడు.

  కొడుకే త‌న బండారాన్ని బ‌య‌ట‌పెట్టాడ‌ని కోప‌గించుకున్న త‌ల్లి.. కొడుకును హింసించ‌డం మొద‌లుపెట్టింది. అకార‌ణంగా కొట్ట‌డం, ఇంటి ప‌నులు చేయించ‌డం, స‌రిగా తిండిపెట్ట‌క‌పోవ‌డం వంటి చ‌ర్య‌ల‌తో కొడుకుకి న‌ర‌కం చూపించింది. వీట‌న్నింటినీ తండ్రికి చెప్పుకుని బాధ‌ప‌డ్డాడు. మ‌ళ్ళీ సెల‌వు పెట్టి ఇంటికి వ‌చ్చిన భ‌ర్త‌.. భార్య‌ని తీవ్రంగా మంద‌లించాడు. తండ్రి న‌వీన్ మ‌ళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయాడు. కొడుకు వార‌ణాసిలో ఉన్న మేన‌మామ ఇంటికి వెళ్ళాన‌ని చెప్పి, ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. అయితే ఆ బాలుడు వార‌ణాసి వెళ్ళ‌కుండా అక్క‌డే ఉండి ప‌రిస్థితిని గ‌మ‌నించాడు.

  భ‌ర్త డ్యూటీకి వెళ్ళిపోయాడ‌ని, కొడుకు మేన‌మామ ఇంటికి పోయాడ‌ని భావించిన సాధ‌నాసింగ్.. ఆ రాత్రి ప్రియుడిని ఇంటికి పిలిచింది. ఇదంతా గ‌మ‌నించిన బాలుడు ఇంట్లోకి వ‌చ్చి.. ప్రియుడితో క‌లిసి ఉన్న త‌ల్లిని తుపాకీతో కాల్చి చంపేశాడు. ప్రియుడు అక్క‌డి నుంచి త‌ప్పించుకుని పారిపోయాడు. చ‌నిపోయిన త‌ల్లి శ‌వాన్ని ఆ బాలుడు త‌న తండ్రికి వీడియో కాల్‌లో చూపించాడు. త‌ల్లిని చంపేసిన బాలుడు ఆ త‌ర్వాత ఫ్రెండ్స్ తో క్రికెట్ కూడా ఆడాడు.

  అయితే పోలీసులు మాత్రం కేసును స‌క్ర‌మంగా విచారించ‌కుండా ఆన్ లైన్ ప‌బ్జీ గేమ్‌ను అడ్డుకున్న త‌ల్లిని చంపాడంటూ క‌ట్టుక‌ధ అల్లారు. ఆ అల్లిన క‌ధ‌నే బాల‌ల నేర‌స్తుల న్యాయ‌స్థానంలో చెప్పారు. అయ‌తే ఆ బాలుడు మాత్రం .. తండ్రిని మోసం చేసి, వేరే వ్య‌క్తితో అక్ర‌మసంబంధం పెట్టుకుంద‌ని, అది భ‌రించ‌లేకే తాను త‌ల్లిని చంపాప‌ని చెప్ప‌డం విశేషం.

  త‌ల్లిని చంపినందుకు బాధ ప‌డ‌డం లేద‌ని, తండ్రిని మోసం చేసినందుకు త‌ల్లికి శిక్ష విధించాన‌ని చెప్పాడు. త‌న క‌ళ్ళ ముందే అక్ర‌మ‌సంబంధం న‌డుపుతోన్న‌ త‌ల్లిని చంపాల‌న్న ఉద్దేశ్యంతోనే తండ్రి పిస్ట‌ల్ తో కొన్నాళ్ళ పాటు శిక్ష‌ణ కూడా తీసుకున్నాడు. అయితే పోలీసులు మాత్రం ప‌బ్జీ గేమ్ అడ్డుకున్నందుకే త‌ల్లిని కాల్చి చంపాడ‌ని చెప్తున్న‌ది అబ‌ద్ద‌మ‌ని క్లారిటీగా చెప్పాడు. కానీ అస‌లు నిజం ఇది అని కోర్టుకు విన్న‌వించాడు ఆ ప‌ద‌హారేళ్ళ బాలుడు.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..