అక్రమసంబంధాల్లో లేచిపోతే కటకటాల్లోకి..

  0
  373

  అక్ర‌మ‌సంబంధాల మోజులో భ‌ర్త‌ను, బిడ్డ‌ల‌ను వ‌దిలేసి ప్రియుడితో ప‌రారైపోతున్న భార్య‌ల గురించి వింటూనే ఉన్నాం. ఇత‌ర ప్రాంతాల్లో ఎలాఉన్నా ఇటీవ‌ల‌కాలంలో కేర‌ళ రాష్ట్రంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. పోలీస్ స్టేష‌న్ల‌లో ఈ త‌ర‌హా కేసుల సంఖ్య కూడా క్ర‌మంగా పెరుగుతోంది. తాజాగా మ‌రో కేసు కూడా ఇలాంటిదే న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం.మైన‌ర్ కూతుళ్ళ‌ను అనాధ‌లు చేసి ఓ జిమ్ ట్రైన‌ర్‌తో లేచిపోయిన 44 ఏళ్ళ మ‌హిళ‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

  కేర‌ళ‌లోని వ‌లీమాల‌లో మినిమోల్ అనే మ‌హిళ, 30 ఏళ్ళ షైజు అనే వ్య‌క్తితో ప్రేమ‌లో ప‌డింది. జిమ్‌కు వెళ్తున్న ఆమెకు, అత‌నితో ప‌రిచ‌యం ఏర్ప‌డి అక్ర‌మ సంబంధానికి దారి తీసింది. మినిమోల్‌కు 11, 13 ఏళ్ళ కూతుళ్ళు ఉన్నారు. భ‌ర్త‌కు తెలియ‌కుండా అక్ర‌మ‌సంబంధాన్ని కొన‌సాగిస్తూ ఉన్నప‌ళంగా ప్రియుడితో లేచిపోయింది.

  క‌చెనీలోని ఓ గుడిలో పెళ్ళి కూడా చేసుకుంది. త‌న‌కు విడాకులు ఇవ్వ‌కుండానే జిమ్ ట్రైన‌ర్‌తో అక్ర‌మ‌సంబంధం పెట్టుకుని, బిడ్డ‌లిద్ద‌ర‌నీ అనాధలు చేసి, మోసం చేసి పోయింద‌ని భ‌ర్త పోలీస్ స్టేష‌న్‌లో కేసు పెట్టాడు. దీంతో పోలీసులు ఆమెను, ప్రియుడిని అరెస్ట్ చేశారు. వారిపై అనైతిక ప్ర‌వ‌ర్త‌న‌, చీటింగ్ కేసులు న‌మోదు చేసి జైలుకి పంపారు. గ‌తంలో ల‌క్ష్మీ అనే 31 ఏళ్ళ వివాహిత భ‌ర్త బిడ్డ‌ల‌ను వ‌దిలి ప్రియుడు మ‌నోజ్‌తో ప‌రారైంది. వారిని కూడా అరెస్ట్ చేశారు.

  ఫత‌నంమిట్టం ప్రాంతంలో 13 ఏళ్ళు, 9 ఏళ్ళ బిడ్డ‌ల‌ను వ‌దిలేసి బీనా అనే మ‌హిళ‌, ల‌తీష్ అనే యువ‌కుడితో వెళ్లిపోయింది. వీరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్ల‌ల‌ను వ‌దిలి వెళ్ళ‌డం నేరంగా ప‌రిగ‌ణిస్తూ పోలీసులు కేసులు న‌మోదు చేస్తున్నారు.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..