ప్రియుడికి డబ్బులు ఇచ్చేందుకు కన్నా బిడ్డలే ప్రియుడిచేత కిడ్నాప్ చేయించి నాటకమాడిన నీచురాలిని పోలీసులు పట్టుకున్నారు. ప్రియుడినికూడా అరెస్ట్ చేసి , ఇద్దరినీ జైల్లో పెట్టారు.. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్ర గ్రామంలో రామకృష్ణ అనే వ్యక్తి , ఓ వివాహితతో శర్మ సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకు 14 , 15 ఏళ్ళ పిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలిసి అత్త కోడలిని మందలించింది. ఆయినా ఆమె అక్రమసంబంధం కొనసాగించింది. ప్రియుడు తనకు డబ్బులు కావాలని అడగడంతో , స్వంత బిడ్డలనే కిడ్నాప్ చేయించింది.
రామకృష్ణతో , పిల్లలిద్దరినీ రాజమండ్రికి పంపింది. సినిమాకు తీసుకుపోతాడని చెప్పి పంపించింది. అయితే , రామకృష్ణ , పిల్లలిద్దరినీ లాడ్జీలో నిర్బదించి , మారు గొంతుతో ఫోన్ చేసాడు. పిల్లలిద్దరూ తనవద్ద ఉన్నారని , 15 లక్షలు ఇవ్వకపోతే , చంపేస్తానని చెప్పాడు. దీంతో పిల్లల తండ్రి , నానమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిడ్డలను ప్రియుడితో , తల్లే పంపించింది పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని , ఆమె చేత ప్రియుడు రామకృష్ణకు ఫోన్ చేయించారు. సిగ్నల్స్ ఆధారంగా అతడు ఉండే లాడ్జిని గుర్తించి , పిల్లలను కిడ్నాప్ చెర విడిపించారు.. తల్లిని , తల్లి ప్రియుడిని అరెస్ట్ చేశారు..