పుట్టిన రోజు ఆనందంగా ఇంటికొచ్చిన బిడ్డని , ఓ కసాయి తల్లి ప్రియుడి సాయంతో చంపేసింది.. బయటకు పోయిన 12 ఏళ్ళ కొడుకు , త్వరగా ఇంటికొస్తాడని ఊహించని , ఆ కామాంధురాలైన తల్లి , తన భాగోతం బయటపడటం , కొడుకే , బెడ్ రూమ్ లో ప్రియుడితో నగ్నంగా ఉన్న తల్లిని చూడటంతో , కొడుకు ప్రాణం తీసింది. మధ్యప్రదేశ్ లోని షాజాపూర్ జిల్లా ఆకొడియాలో ఈ దారుణం జరిగింది. మే నెల మూడో తేదీన 12 ఏళ్ళ కొడుకు వరుణ్ పుట్టినరోజు. తండ్రి సూర్యవంశీ వచ్చి సినిమాకు , హోటల్ కి తీసుకుపోతానని చెప్పాడు.
ఫ్రెండ్స్ ఇంటికెళ్లిన వరుణ్ , తొందరగా ఇంటికొచ్చేసాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో , ప్రియుడిని పిలిపించుకొని , రాసలీలల్లో మునిగిపోయిన తల్లి ,మమత అభ్యంతరకరమైన భంగిమలో , ప్రియుడితో ఉండటాన్ని కొడుకు చూసాడు. దీంతో ఆమె , కొడుకు , తండ్రికి అంతా చెప్పేస్తాడని , కొడుకుని చంపేయమని ప్రియుడిని కోరింది.
దీంతో , బిడ్డ పుట్టినరోజునే , ఆ బాలుడి ముఖానికి దిండు పెట్టి , ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు.. గుండె నొప్పి అని చెప్పాడని , హాస్పిటల్ కి పోదామని అనుకుంటున్న తరుణంలో చనిపోయాడని బుకాయించింది. అయితే , ఇంట్లో భర్త , కొడుకు లేనప్పుడు మమత నీచత్వాన్ని చూసిన ఇరుగుపొరుగు ఇచ్చిన సమాచారంతో , తండ్రి , ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించి అసలు గుట్టు బయటకులాగి , నిన్ననే ఇద్దరినీ అరెస్ట్ చేశారు..