అమ్మాయిలపై కన్నేసి ,కాటేసే ఎస్సై అరెస్ట్.

  0
  933

  చంద్రగిరి ఎస్సై విజయ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో అమ్మాయిలని మోసం చేస్తున్నాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి.. అమ్మాయిలను లోబరచుకుంటాడని అతడిపై ఫిర్యాదులు ఉన్నాయి. గతంలో కూడా విజయ్ కుమార్ పై ఓ యువతి దిశా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో తప్పక ఆ యువతిని విజయ్ కుమార్ పెళ్లి చేసుకున్నాడు.

  తాజాగా విజయ్ కుమార్ మోసానికి బలైన, అనంతపురం జిల్లా పామిడికి చెందిన సరస్వతి అనే యువతి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రేమ పేరుతో మోసపోయిన సరస్వతి ఆత్మహత్యకు ప్రయత్నం చేసి, అనంతపురం హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయింది. దీంతో ఆమె బంధువులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  ఈ రెండు సంఘటనలకు ముందే ఈ ఎస్సైపై ఇలాంటి ఫిర్యాదులు చాలానే ఉన్నాయి. గుంతకల్లులో పనిచేస్తున్న సమయంలోనూ ఓ మహిళా కానిస్టేబుల్ ని ప్రేమపేరుతో వంచించాడని ఫిర్యాదులు ఉన్నాయి. ఎస్సైగా ప్రోమోట్ అయ్యాక కూడా ఇతడిపై పలువురు మహిళలు ఫిర్యాదు చేశారు. సరస్వతి కేసులో ఇతడి పాపం పండి అరెస్ట్ అయి జైలు కెళ్ళాడు.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.