పగపట్టిన కోతులు , ఊళ్ళో కుక్కలని చంపేశాయి..

  0
  27886

  ప‌గ‌, ప్ర‌తీకారం కోతుల‌కు ఇంత దారుణంగా ఉంటుంద‌ని బ‌హుశా ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. ఇప్పుడు మ‌హారాష్ట్రంలోని బీడ్ జిల్లా మ‌జాల్ గావ్ లో ఓ కోతుల మూక గ్రామంలోని 250 కుక్క‌ల‌ను చంపేశాయి. ఓ కుక్క ఒక కోతి పిల్ల‌ను చంపింద‌ని, రెచ్చిపోయిన కోతులు ఏకంగా ఊరి మీద దాడి చేసి క‌నిపించిన కుక్క‌ను క‌నిపించిన‌ట్లు చంపేశాయి. న‌మ్మ‌లేని ఈ నిజం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది.

  కోతుల విజృంభ‌ణ‌ను ఎవ‌రూ అడ్డుకోలేక‌పోయారు. అడ్డుకున్న వారిపైన కూడా కోతులు దాడులు చేశాయి. 15 రోజుల వ్య‌వ‌ధిలో గ్రామంలోని కుక్క‌ల‌న్నింటినీ చంపేశాయి. పెంపుడు కుక్క‌ల‌ను చెట్ల మీద‌కి, మిద్దెల మీద‌కి లాక్కెళ్ళి మ‌రీ చంపేశాయి. అట‌వీశాఖ అధికారులు వ‌చ్చి ఆ కోతుల‌ను ప‌ట్టే ప్ర‌య‌త్నం చేసినా, ఒక్క కోతిని కూడా ప‌ట్ట‌లేక‌పోయారు. కొంత‌మంది గ్రామ‌స్తులు త‌మ కుక్క‌ల‌ను ర‌క్షించుకునే ప్ర‌య‌త్నం గాయ‌ప‌డి కాళ్ళు చేతులు విర‌గ్గొట్టుకున్నారు.

  ఇప్పుడు గ్రామంలో దాదాపు కుక్క‌లు లేకుండా పోయాయ‌ని, అయినా కోతులు ఇప్పుడు స్కూల్ కి వెళ్ళే పిల్ల‌ల‌పై దాడులు చేస్తున్నాయ‌ని గ్రామ‌స్తులు చెబుతున్నారు. ఇంత దారుణ‌మైన ప‌గ‌, ప్ర‌తీకారం కోతుల్లో ఉంటుంద‌ని గ్రామ‌స్తులు తెలుసుకోలేక‌పోయారు.

  కొన్నాళ్ళ క్రితం క‌ర్నాట‌క‌లోని చిక్క‌మగుళూరులో ఓ ఆటోడ్రైవ‌ర్ త‌న‌పై రాయి విసిరాడ‌ని, ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రాకుండా చేసింది. అత‌ను ఎక్క‌డికి వెళ్ళినా వెతికివెతికి వెంటాడింది. ఆటో ఫ‌ర్నీచ‌ర్ ను చీలిక‌లు, పీలిక‌లు చేసింది. చివ‌రికి అట‌వీ అధికారులు ఆ కోతిని ప‌ట్టుకుని అడ‌విలో వ‌దిలి పెట్టినా, అది మ‌ళ్ళీ వ‌చ్చి ప‌గ తీర్చుకుంది.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.