ఇది ఏమి ప్రేమో, ప్రియుడిని గన్ తో కాల్చింది.

  0
  1272

  ఇది ఓ ప్రియురాలు చేసిన దారుణం. ప్రియుడిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని స‌డ‌న్ గా హ్యాండ్ బ్యాగులో నుంచి పిస్టోల్ తీసుకుని కాల్చిపారేసింది. ఈ దారుణం విదేశంలో కాదు మ‌న‌దేశంలోనే చోటు చేసుకుంది. ప‌శ్చిమ బెంగాల్ లోని ప‌ర్బా జిల్లాలోని కేషియా గ్రామంలో 22 ఏళ్ళ యువ‌తి అదే వ‌య‌సున్న యువ‌కుడు నాలుగేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. యువ‌తి మ‌ధ్య‌లో జార్ఖండ్ లో ఓ ఉద్యోగానికి సంబంధించి ట్రైనింగ్ కి వెళ్లింది. రెండు నెల‌ల త‌ర్వాత తిరిగి గ్రామానికి వ‌చ్చింది.

  గ్రామంలోని స‌ర్క‌స్ గ్రౌండ్ లోకి త‌న ప్రియుడిని ర‌మ్మ‌ని కోరింది. అక్క‌డికి వ‌చ్చిన ప్రియుడిని అంద‌రూ చూస్తుండ‌గానే కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంది. ఆ త‌ర్వాత స‌డ‌న్ గా హ్యాండ్ బ్యాగులో నుంచి పిస్టోల్ తీసి కాల్పులు జ‌రిపింది. బుల్లెట్ ప్రియుడి క‌డుపులోకి దూసుకెళ్ళింది. దీంతో వెంట‌నే స్థానికులు ఆ యువ‌కుడిని చికిత్స కోసం ఆస్ప‌త్రికి తీసుకెళ్ళారు. ఆ యువ‌తిని ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు. కొంత‌కాలంగా తాను ఊరిలో లేకుండా బ‌య‌ట ఉన్న‌ప్ప‌టికీ, త‌న‌ను క‌లిసేందుకు త‌న ప్రియుడు రాలేద‌న్న కోపంతో ఆ యువ‌తి కాల్పులు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.