ఏయ్.. కారు ఆపు..జామకాయలు కొనుక్కున్న మోహన్ బాబు.

  0
  48623

  ఏయ్.. కారు ఆపు.. కారు ఆపు..
  రోడ్డుపక్కన జామకాయలు కొనుక్కున్న మోహన్ బాబు..
  =========================
  సినీ నటుడు మోహన్ బాబు జామకాయలు కొనుక్కొని తిన్నాడు. కృష్ణా జిల్లా, పెదపారుపూడి మండలానికి చెందిన వానపాముల గ్రామం నుండి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళుతూ ఉండగా దారిలో జామపళ్ళు అమ్మడం చూశాడు. వెంటనే కారును పక్కకు నిలిపి జామకాయలు కొనుక్కొని తిన్నాడు. కొద్దిసేపు పండ్ల వ్యాపారితో మాట్లాడి, కష్టసుఖాలు తెలుసుకున్నాడు. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న వారంతా మోహన్ బాబును చూసి.. మాట్లాడారు. సెల్ఫీలు తీసుకొని సంబరపడ్డారు. కృష్ణా జిల్లా అంటే తనకెంతో ఇష్టమని ఈ సందర్భంగా మోహన్ బాబు వ్యాఖ్యానించారు. మోహన్ బాబుతో సెల్ఫీలు దిగేందుకు జనం కార్లన్నీ రోడ్డుపై నిలిపివేయడంతో కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.