కడవ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో నిన్నటి నుంచి ఏకధాటిగా వానలు పడుతూనే ఉన్నాయి. ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాలు, వరదల నుంచి ప్రజలు ఇంకా తేరుకోకముందే, మళ్ళీ వర్షాలు కుంభవృష్టిగా కురుస్తున్నాయి. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. చెరువులు, కాలువలకు గండి పడడుతుండడంతో వరదలు రోడ్లను ముంచెత్తుతున్నాయి. పంట పొలాలు ముగినిపోతున్నాయి. గుడిసెలు కూలిపోతున్నాయి. భవనాలు సైతం కూలే దశకు చేరుకుంటున్నాయి. రైల్వేకోడూరు శివారు ప్రాంతంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. గుంజనేరు కాలువ తీరం వెంబడి ఓ ఇల్లు కుప్పకూలిపోయింది. ఇల్లు వెనక్కి ఒరుగుతున్న విషయాన్ని ముందే గమనించి… ఆ ఇంట్లోని వారు బయటికి వచ్చేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ మధ్యాహ్నం ఆ ఇల్లు కాలువలోకి పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.