మోడీ కోసం వేసిన రోడ్లు 20 గంటల్లో శిధిలం.

  0
  101

  ఇది ప్రధాని నరేంద్రమోడీ పర్యటన సందర్భంగా ఆరు కోట్లతో వేసిన రోడ్డు.. మూడున్నర కిలోమీటర్ల ఈ రోడ్డు ఈ నెల 21 ,22 న ప్రధాని బెంగుళూరు పర్యటన కోసం వేశారు. అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఆయన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు.. ఇందుకోసం , ఆయన పోయే మార్గంలో 23 కోట్లతో రోడ్లకు సొగసులు అద్దారు. దీనిలో భాగంగానే ఈ రోడ్డుని వేశారు.

  అయితే ఒక్క రోజు రాత్రి వర్షానికే రోడ్డు కుంగిపోయింది. ఇదేమని అడిగితే , రోడ్డుకింద నీళ్లు పారిఉంటాయని అందుకే కుంగిపోయిందని అంటున్నారు.. తమాషా ఏమిటంటే , ప్రధాని పర్యటనకు రోడ్లపేరుతో నిధులు స్వాహా బాగానే జరిగిందన్న విమర్శలున్నాయి..

  అయితే , మోడీ బెంగుళూరుని వదిలిపోయిన వెంటనే , రోడ్లు ఇలా ధ్వంసం కావడం మాత్రం ఇప్పుడు జనం నోళ్ళలో రకరకాలుగా నానుతొంది. కర్ణాటకలో బీజేపీ సర్కార్ , కిరికిరి ఏమిటో తేలాలని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రధాని పేరుతొ , ఆయన కోసం వేసిన రోడ్లైనా 24 గంటలుకూడా లేకపోతే ఎలాగని నిలదీస్తున్నారు..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.