పెళ్ళైన ఒకటిన్నర నెలలకే , కొత్త పెళ్లికూతురు , భర్తకు , అత్తమామలకు షాక్ ఇచ్చింది.. కష్టం లేకుండా , మూడో నెల గర్బంతోనే ఆమె తాళికట్టించుకుందని తేలిపోయింది. ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ లో ఒకటిన్నరనెలలక్రితం , ఓ యువకుడికి పెళ్లయింది. వరం క్రితం కోడలు కడుపు నొప్పిగా ఉందంటే , అత్తమామలు , భర్త డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు.
ఆమెను పరీక్షించిన లేడీ డాక్టర్ , భర్తను పిలిచి , కంగ్రాట్స్ , మీ భార్య ఐదో నెల గర్భవతి అనిచెప్పారు. ఈ మాట విన్న , అత్త , భర్త అక్కడే కూలబడ్డారు. పెళ్ళై , ఒకటిన్నర నెలకూడా కాకముందే ఐదో నెల గర్భం ఏమిటంటూ , నిలదీశారు.
దీంతో ఆమెకు పెళ్లయినాటికే మూడోనెల గర్భం అనితేలింది. దీంతో పోలీసులదగ్గరకి పరుగుతీశారు. పెళ్లికూతురు , ఆమె తల్లితండ్రులు , తమను మోసంచేశారని కేసుపెట్టారు.. పెళ్లికూతురిని పుట్టింటికి పంపేశారు..