మూడు కోట్ల కారు పోతే ఏమిచేశాడో తెలిస్తే షాకే

  0
  708

  ఆధునిక యుగంలో టెక్నాలజీ పెరిగింది , దానితో పాటే మోసాలు కూడా పెరిగాయి . ఆ మోసాలను చేదించే టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చింది . అయినా మోసగాళ్లు, దొంగలు తమ పని తాము చేసుకుని పోతూనే ఉంటారు . ఇప్పుడు ఓ కారు యజమాని , తన కారుని దొంగలు తీసుకుపోతుంటే , దాని వెనుక పరుగులు తీయలేదు.. పోలీస్ స్టేషన్ కి పరుగెత్తలేదు..కనీసం పోలీసులకు ఫోన్ చేయలేదు.. చాలా సింపుల్ గా , కారు తీసుపోతుంటే , చూసి కంప్యూటర్ ముందు కూర్చొని కారు కదలకుండా చేసేసి , కారు ఎక్కడుందో అక్కడికెళ్లి , తిరిగి కారు తెచ్చేసుకున్నాడు..

  జాన్ అనే వ్యక్తికీ సంబందించిన మూడు కోట్ల 30 లక్షల రూపాయలు విలువ చేసే రోల్స్ రాయిస్ కారు పోయింది . అమెరికాలోని ఐలాండ్ లో వారం క్రితం రాత్రి సమయంలో ఆయన కారు డోర్ తీసినట్టు అలారం వినిపించింది . దీంతో తన కారు చోరి గురవుతుందని హడావుడిగా మేడ పై నుంచి వచ్చే లోగా కారు తీసుకుని దొంగలు వెళ్ళిపోయారు. అయితే తన కారు దొంగలు తీసుకెళ్తున్నారని ఆయన పోలీసులు దగ్గరికి పరిగెత్త లేదు.

  వెంటనే ఇంట్లో కెళ్ళి కంప్యూటర్ ఆన్ చేసేసాడు కంప్యూటర్ ఆన్ చేసి ఒక ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా తన కారు ఎక్కడుందో కనుక్కున్నాడు ఆ తర్వాత మరో సాఫ్ట్ వేర్ లో తన ఇంట్లోనుంచే కారు ఇంజన్ పని చేయకుండా కంప్యూటర్ నుంచి రిమోట్ ద్వారా ఆపరేట్ చేసాడు. దీంతో దొంగలు తీసుకెళుతున్న కారు ఆగిపోయింది . ఆ వెంటనే తన కారు ఎక్కడుందో కచ్చితంగా గుర్తించి దొంగలు వదిలేసి పోయిన కారు తెచ్చేసుకున్నాడు.. అదీ సంగతి జాన్ ద గ్రేట్ టెక్నాలజిస్ట్..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.