అనేక కారణాలతో చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న హరిహర వీరమల్లు షూటింగ్ మళ్ళీ మొదలైంది.. పవన్ కళ్యాణ్ షూటింగ్ స్పాట్ లోకి వచ్చేశారు. ఒక చారిత్రక కదాంశం నేపథ్యంలో ఒక వీరోచితమైన పోరాట యోధుడు చరిత్రే హరిహరవీరమల్లు. ఇప్పుడు షూటింగ్ జోరుగా జరుగుతోంది.
కొన్ని అనివార్య కారణాలతో గతంలో షూటింగ్ వాయిదా పడింది , అయితే ఇప్పుడు ఆ చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలనే సంకల్పంతో సినిమా యూనిట్ నిర్ణయం తీసుకుంది. పవన్ కళ్యాణ్ కూడా దసరా సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నారు.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు మళ్లీ మరో హిట్ కానుందని , పవన్ కళ్యాణ్ కీర్తి కిరీటంలో కలికితురాయి అని చెబుతున్నారు .
హరిహర వీరమల్లు సెట్ లో పవన్ కళ్యాణ్ షార్ట్స్ తో ఉన్న లేటెస్ట్ స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.. 150 నుంచి 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపుదిద్దుకోనుందని చెబుతున్నారు.
నిధిఅగర్వాల్ , అర్జున్ రాంపాల్ , నర్గిస్ ఫక్రి తదితరులు తారాగణంగా సినిమా రెడీ అవుతొంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు..