మహిళా ఎమ్మెల్యే కొడితే పగిలింది టెంకాయ కాదు.. మరేందో ..?

  0
  1337

  అధికార పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే , కొత్తగా వేసిన రోడ్డు ప్రారంభోత్సవానికి వచ్చింది.. పూజ తరువాత టెంకాయ కొట్టింది.. విచిత్రం టెంకాయ పగలలేదు.. ఏమైందో తెలుసా..? రోడ్డు పగిలి బీటలు వారింది.. కొట్టిన టెంకాయ పగలకపోగా , మట్టిమీద వేసిన కంకర , తారు లేచి వచ్చాయి..ప్రారంభోత్సవానికి వచ్చిన వాళ్లంతా నవ్వుకున్నారు..

  ఆ తరువాత అధికారులపై విరుచుకు పడ్డారు. ఏమి చెయ్యాలో ఎమ్మెల్యే కి అయోమయం అయింది.. కాసేపటికి తేరుకొని , అధికారులను తిట్టిపారేసింది.. విచారణ చేయిస్తానని చెప్పింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా ..? ఉత్తరప్రదేశ్ లోని బిజానూర్ లో , ఆ మహిళా ఎమ్మెల్యే పేరు సుచి చౌదరి.. అదీ సంగతి..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.