పంచాయతీ వార్డుకి అందాల సుందరి పోటీ..

  0
  169

  మిస్ ఇండియా పోటీల్లో రన్నరప్ గా వచ్చిన ఓ యువతి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అందాల సుందరి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడం ఏంటని అనుకోవద్దు. ఆమె నిజంగానే ఉత్తర ప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో జాన్ పూర్ నుంచి పోటీకి సిద్ధమైంది. 2015 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది దీక్షాసింగ్.

  కాలేజీ చదివి రోజులనుంచి తాను రాజకీయ చర్చల్లో పాల్గొనేదాన్ని అని, ఉపన్యాస పోటీల్లో ప్రతిభ చూపించేదాన్ని అని, తన గ్రామానికి తరచూ వెళ్లొచ్చే దాన్ని అని చెబుతోంది.

  ప్రస్తుతం గోవాలో ఉంటున్న దీక్షా సింగ్, తన తండ్రి కోరిక మేరకు, జాన్ పూర్ 26వ వార్డు నుంచి పోటీ చేసింది. ఆమె తండ్రి జితేంద్ర సింగ్ చాలా కాలం నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరికతో ఉన్నారు. అయితే ఆ స్థానం మహిళలకు కేటాయించడంతో తన కూతురిని బరిలోకి దించారు. ఏప్రిల్ 15న జరగబోతున్న పోలింగ్ కోసం ఇప్పుడీ అందాల సుందరి విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ప్రస్తుతం పలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ.. మోడల్ గా కూడా బిజీగా ఉంది దీక్షా సింగ్.

   

  ఇవీ చదవండి

  ఆమె వేధింపులతో యువకుడు ఆత్మహత్య..

  నూటికో, కోటికో ఇలాంటి డాక్టర్లు ఉండబట్టే..

  మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

  సినిమాలో సీన్ కాదు.. కాశీలో పుర్రెల మాలతో అఘోరాల హోలీ సంబరాలు