నూటికో, కోటికో ఇలాంటి డాక్టర్లు ఉండబట్టే..

    0
    417

    నూటికో, కోటికో ఇలాంటి డాక్టర్లు ఉండబట్టే , వైద్యుడు , దేవుడితో సమానమన్న సామెత ఇంకా జనం నోళ్ళల్లో నానుతుంది. ఒక వైపు హాస్పిటల్ తగలబడిపోతున్నా , మరో వైపు ఆపరేషన్ పూర్తిచేశారు ఆ డాక్టర్లు. ఓపెన్ హార్ట్ సర్జరీ మొదలైన 45 నిమిషాల్లో హాస్పిటల్ టెర్రస్ పై మంటలు అలుముకున్నాయి. హాస్పిటల్లో 128 మంది ఇన్ పేషేంట్లను షిఫ్ట్ చేశారు. ఆపరేషన్ మధ్యలో ఆపితే పేషేంట్ చనిపోతాడు. అందుకే డాక్టర్లు , ఫైర్ ఆఫీసర్ కు , ఆపరేషన్ థియేటర్ లోకి , మంటలు , పొగలు రాకుండా చూడమన్నారు. వాళ్ళుకూడా ప్రాణాలకు తెగించి , ఆపరేషన్ థియేటర్ కు , మంటలు వ్యాపించకుండా జాగ్రత్త పడ్డారు. డాక్టర్లు ఏమాత్రం భయపడకుండా , మరో రెండు గంటలు శ్రమించి ఆపరేషన్ పూర్తిచేసి , పేషేంట్ ను వేరే హాస్పిటల్ కు తరలించి , ఇంటికెళ్లారు.. రష్యా లోని ఒర్లోవ లో జరిగిన ఈ అద్భుతాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ ప్రశంసించారు..

     

     

    ఇవీ చదవండి

    మందుబాబులు వాక్సిన్ వేసుకోవచ్చా..?

    మాస్క్ లేకపోతె మోకాళ్ళమీద నడిపిస్తారు.

    నౌకను చంద్రుడు కదిలించాడు..

    బుసలు కొట్టే కోడెనాగుపై ఆయన చేయి పడితే అంతే.