టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?

  0
  1975

  గతంలో కొవిడ్ వచ్చినవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేదానిపై పెద్ద చర్చలు జరిగేవి. సోషల్ మీడియా యూనివర్సిటీలో అందరూ లెక్చర్లు దంచేవారు. అది తినకూడదు, ఇది తినొచ్చు, ఆ పత్యం చేయండి అంటూ నోటికొచ్చింది చెప్పేవారు. ఇప్పుడు కొవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంతకంటే ఎక్కువగా ప్రచారాలు మొదలయ్యాయి. వ్యాక్సిన్ తీసుకున్నవారు చికెన్ తినొచ్చా, టీకా తర్వాత మద్యం తాగొచ్చా.. ఇలా మొదలైన ప్రశ్నలు.. చివరకు టీకా తీసుకుని శృంగారంలో పాల్గొనవచ్చా అనేవరకు వచ్చాయి. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సలహాలు, సూచనలు రాలేదు కానీ.. పలువురు సెక్సాలజిస్ట్ లు దీనిపై స్పందిస్తున్నారు.

  స్త్రీ, పురుషులిద్ద‌రూ కోవిడ్ టీకా రెండో డోసు తీసుకున్న త‌ర్వాత కొన్ని వారాల పాటు కండోమ్‌ లు వాడాల‌ని సూచిస్తున్నారు నిపుణులు. ఘ‌జియాబాద్‌ కు చెందిన డాక్ట‌ర్ దీప‌క్ వ‌ర్మ ఇచ్చిన వివరణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సార్స్ సీవోవీ2 వైర‌స్ అనేది కొత్తది అని, ఆ వైర‌స్ ‌ను నిర్వీర్యం చేసేందుకే టీకాల‌ను అభివృద్ధి చేశార‌ని, ఆ టీకాలు వాడ‌డం వ‌ల్ల ఏవైనా దీర్ఘ‌కాలిక వ్యాధుల వ‌స్తాయా లేదా అనేది ఇప్పుడే చెప్ప‌లేమ‌ని ఆయ‌న అన్నారు.
  టీకా తీసుకున్న తర్వాత శృంగారంలో పాల్గొన‌డం ద్వారా ఏమైనా ఇబ్బందులు కలుగుతాయో లేవో చెప్పలేమని, అయితే రెండో డోస్ తీసుకున్న మూడు వారాల వరకు కండోమ్ వాడటం సురక్షితమని ఆయన చెప్పారు. ఎందుకంటే శృంగార స‌మ‌యంలో శ‌రీర ద్ర‌వాలు కాంటాక్ట్‌ లోకి వ‌స్తాయ‌ని, అందుకే ముందు జాగ్ర‌త్త‌గా కండోమ్ ‌లు వాడ‌డం ఉత్త‌మం అని తెలిపారు.

  ఇవీ చదవండి

  ఆమె వేధింపులతో యువకుడు ఆత్మహత్య..

  నూటికో, కోటికో ఇలాంటి డాక్టర్లు ఉండబట్టే..

  మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

  సినిమాలో సీన్ కాదు.. కాశీలో పుర్రెల మాలతో అఘోరాల హోలీ సంబరాలు