మిరేజ్ యుద్ధ విమానం టైరు కొట్టేశారు..

  0
  879

  ఈ దొంగ ఎవడోగానీ ఏకంగా యుద్ధ విమానం టైరు చోరీచేశాడు.. వినేందుకు విచిత్రంగా ఉన్నా , ఇది నిజం.. ఇప్పుడీ చోరీ పోలీసులకు సవాల్ గా మారింది.. ఈ చోరీ ఎక్కడొకడు.. మనదేశంలోనే.. చాటుమాటుగా జరిగిందికూడా కాదు.. రద్దీగా ఉన్న ట్రాఫిక్ లోనే.. ఉత్తరప్రదేశ్ లోని , బక్షికా తలాబ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి , జోధ్ పూర్ కు , ఒక ట్రాలీలో మిరేజ్ యుద్ధవిమానాన్ని తరలిస్తున్నారు.

  ఆశియానా అనే పోలీస్ లిమిట్స్ నుంచి , షహీద్ పథ్ నుంచి ట్రాలీ పోతుండగా , ఒకచోట ట్రాలీ ట్రాఫిక్ లో చిక్కుకుంది. ఆ సమయంలో యుద్ధ విమానం ఐదు టైర్లలో , ఒక టైరు చోరీకి గురైంది.. ఈ విషయం గమనించిన ట్రాలీ డ్రైవర్ హేమసింగ్ రావత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.