క్లాస్ రూమ్ లో చిరుత.. విద్యార్థులు పరార్..

  0
  932

  ఎక్కడా చోటు దొరకనట్టు ఆ చిరుతపులికి స్కూల్ లోనే చోటు దొరికినట్టుంది. రాత్రికి క్లాస్ రూమ్ లోకి ప్రవేశించి ఆ బెంచీల చుట్టూ తిరుగుతోంది. అలీఘర్ లోని ఒక స్కూల్ లో చిరుతపులి సంచరిస్తున్నట్టు క్లాస్ రూమ్ సీసీ కెమెరాల్లో బయటపడింది. స్కూల్ కి అనుబంధంగా ఉన్న హాస్టల్ పిల్లలు క్లాస్ రూమ్ లో చదువుకోడానికి వచ్చిన సమయంలో చిరుతపులి కూడా లోపలికి ప్రవేశించింది. దీంతో పిల్లలు భయపడి పరుగులు తీశారు. చిరుత ఆ సమయంలో చేసిన దాడిలో చౌదరి నిహాల్ సింగ్ అనే విద్యార్థి గాయపడ్డాడు. విద్యార్థులంతా హాస్టల్ నుంచి కూడా పరుగులు తీయడంతో చిరుత ఒక్కటే క్లాస్ రూమ్ లో సంచరిస్తూ కనిపించింది. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటీవీ శాఖ అధికారులు దానిని బంధించారు.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.